Karthika Deepam: తింగరే హిమ అని గుర్తించిన జ్వాలా.. సౌర్య కోసం వెతుకుతున్న సౌందర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

హిమ, జ్వాలా ఇద్దరు టిఫిన్ సెంటర్ దగ్గర తింటూ ఉంటారు. అప్పుడు జ్వాలా అక్కడ హిమ కు ముఖం కడుతుంది. జ్వాలా ని చూసి హిమ తన మనసులో సౌర్య ని గుర్తు తెచ్చుకుంటుంది. మరొకవైపు సౌందర్య సౌర్య చిన్నప్పటి ఫోటోని పట్టుకొని వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు టిఫిన్ సెంటర్ దగ్గర జ్వాల, హిమ, టిఫిన్ సెంటర్ లో పనిచేసే అబ్బాయి మధ్య కాస్త ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

సౌర్య, హిమ కు ఏ విధంగా మాట్లాడాలి. ఎలా ఉండాలి ఇలా ప్రతి ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ స్వప్న ఇంటికి వెళ్తాడు. అక్కడ స్వప్న ఎంత పిలిచినా కూడా ప్రేమ్ పలకకుండా మొబైల్లో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు స్వప్న కోపంతో ప్రేమ్ ని తిడుతుంది. అంతేకాకుండా ప్రేమ్ ని తన వద్దే ఉండిపోమని అడుగుతుంది.

అప్పుడు ప్రేమ్ మరి నాన్నను ఎవరు చూసుకుంటారు అని అడుగుతో ఈ విషయంలో నీకు అయితే ఒక న్యాయం అమ్మమ్మ కు ఒక న్యాయమా అని అంటాడు. కానీ స్వప్న ప్రేమ ఎంత నచ్చచెప్పాలి తను చూసిన కూడా ప్రేమ్ వినడు. ఆ తర్వాత హిమ ఆటో లో కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు సౌర్య, హిమ కు ఏమయిందో అని భయపడుతూ ఉంటుంది.

అప్పుడు అటుగా వెళుతున్న సౌందర్య పక్కనే ఉన్న హిమ, సౌర్య లను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన సౌందర్య ఆనందరావు తో కలసి సౌర్య గురించి చర్చిస్తూ ఉంటుంది. అప్పుడు ఆనందరావు బాధపడుతూ దేవుడు జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోమని ఎక్కువ ఆయుష్షు ని ఇచ్చాడేమో సౌందర్య అంటూ బాధపడుతూ ఉంటాడు.

Advertisement

ఆనందరావు మాటలకు సౌందర్య బాధపడుతూ ఆనందరావు ని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య ఇంట్లో సంతోషాలే ఉండాలి. ఇల్లంతా కళకళలాడుతూ ఉండాలి అని అనడంతో అప్పుడు ఆనందరావు అది హిమ పెళ్లి తోనే సాధ్యం అవుతుంది అని అంటాడు. అప్పుడు సౌందర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. మరొకవైపు హిమ బస్తీ లో ఉన్న ఇంటికి వెళ్లి కార్తీక్, దీప ఫోటోల ముందు దీపం వెలిగించి సౌర్య గురించి మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది.

అప్పుడు సౌర్య బస్తీలో ఉన్న ఇంటిని చూసి ఆనందంతో లోపలికి వెళ్లి చూడగా లోపల హిమ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు హిమ మాట్లాడిన మాటలు అన్నీ వింటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel