Guppedantha Manasu: వసుధార ఫై మండిపడ్డ రిషి.. బాధలో జగతి..?

Updated on: March 24, 2022

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

మహేంద్ర ఇంటి నుంచి వెళ్లిపోయినందుకు రిషి బాధతో ఏడుస్తూ ఉంటాడు. మహేంద్ర ఫోటోని చూస్తూ ఎలా ఉన్నావ్ డాడీ, ఏం చేస్తున్నావు అని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు మహేంద్ర కూడా బాధ పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార వస్తుంది. అక్కడికి రాగానే వసు కి రిషి కాల్ చేస్తాడు. అప్పుడు డాడ్ ఎలా ఉన్నాడు అని అడగగా,అప్పుడు వసు మహేంద్ర కి ఫోన్ ఇస్తుంది.

Advertisement

ఇక వెంటనే రిషి మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు. అలా ఒక వైపు రిషి, మరొకవైపు మహేంద్ర బాధపడుతూ ఉంటారు. ఇక మరుసటి రోజు జగతి, మహేంద్ర మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిషి జగతి కి ఫోన్ చేసి ప్రాజెక్టు ను ఆ పద్దు అని చెబుతాడు. ఇంతలో గౌతమ్ అక్కడికి రాగా రిషి ఎలా ఉన్నాడు అని మహేంద్ర అడుగుతాడు.

అప్పుడు గౌతమ్ వాడు ఏమీ బాగా లేడు, ఒంటరిగా వుంటున్నాడు,ఎవరితో మాట్లాడటం లేదు అని చెప్పడంతో జగతి, మహేంద్ర లు బాధపడతారు. ఇంతలో మహేంద్ర తన కారులో వసు ని కాలేజ్ దగ్గర దింపమని చెబుతాడు. మరొకవైపు కాలేజ్ కి వచ్చిన రిషి వసు కోసం ఎదురు చూస్తూ పుష్ప ని అడుగుతాడు.

ఇంతలోనే గౌతమ్,వసు ఒకటే కారులో నుంచి దిగడంతో అది చూసిన రిషి కోపంతో కాలేజీ లో కి వెళ్ళి పోతాడు. ఇక రిషి కోసం వసు భోజనం తీసుకుని వెళ్ళి తినమని బ్రతిమలాడుతుంది. దీంతో రిషి,వసు ఫై మండి పడతాడు. అప్పుడు వసు మీరు భోజనం చేస్తే మహేంద్ర సార్ గురించి రెండు విషయాలు చెప్తామని అనుకున్నాను అని అనడంతో అప్పుడు రిషి తినడానికి ఓకే చెబుతాడు.

Advertisement

అదే సమయంలోనే వసు మహేంద్ర గురించి మాట్లాడుతూ.. మహేంద్ర సార్ ఈ కాలేజీ ను చాలా మిస్ అవుతున్నారు అని చెబుతుంది. ఇక ఇంతలో రిషి ఎలా అయినాసరే మహేంద్ర తో మాట్లాడాలి అనుకుంటాడు. అందుకోసం వసు హెల్ప్ తీసుకుందామని అనుకుంటాడు. ఇక మహేంద్ర గురించి రిషి చెబుతుండగానే అక్కడినుంచి వసుధార వెళ్లిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel