Janaki kalaganaledu: జానకి రామచంద్రలను మైరావతి పొగడడం వెనుక ఆంతర్యం ఏమిటి ? జ్ఞానంబ ఏం చేయబోతుంది ?

Janaki kalaganaledu: ఫ్యామిలీ ప్రేక్షకులను గత కొంత కాలంగా అలరిస్తున్నసీరియల్ జానకి కలగనలేదు. బుల్లి తెరపై తమ సహజ నటనతో, అద్భుతమైన సన్నివేశాలతో అభిమానులను ఆకట్టుకుంటూ తన పంథాను కొనసాగిస్తూ వస్తోంది. ఒక పరువు గల కుటుంబ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, వాటికి ఆ కుటుంబ సభ్యులు రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న కోణంలో ఈ సీరియల్ కొనసాగుతూ వస్తోంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇంత కాలంగా శత్రువులా చూసే మైరావతి శబాష్ సడన్ గా జానకిని మనవరాలా అంటూ లేని ప్రేమను చూపించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎన్నడూ లేనిది ఆమె ఇలా ఆప్యాయంగా పిలిచే సరికి జానకి ఎంతో సంతోషపడుతుంది. అదే క్రమంలో మైరావతి జానకిని కౌగిలించుకుంటుంది.

Advertisement

ఇక ఆ తర్వాత అప్పటికే పిండి వంటలు చేస్తున్న జ్ఞానంబు దగ్గరికి మైరావతితో సహా జానకి దంపతులు వస్తారు. దాంతో జ్ఞానాంబ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఇక ఇంటికి తీసుకువచ్చిన మైరావతి వీళ్ళిద్దరికీ పెద్ద శిక్ష వేస్తాను అని చెప్పి జానకి రామచంద్రల చేత పిండి వంటలు చేపిస్తుంది. మైరావతి.. మీ కొడుకును కోడలిని సంతోషంగా ఇంటికి తీసుకు వెళ్ళు అని అంటుంది. దాంతో జ్ఞానాంబ ఎలా క్షమించమంటావు వీళ్లని అని అంటుంది.

అంతే కాదు వీళ్లు నాకు నమ్మక ద్రోహం చేశారు. వెన్నుపోటు పొడిచారు అంటూ జ్ఞానాంబ వాపోతుంది. ఇక దానితో మైరావతి వాళ్లలా చేయకుంటే ఈ పాటికి నువ్వు మీ కూతురు శవం దగ్గర గుండె పగిలి ఏడ్చే దానివి అని ఆగ్రహంతో రగిలిపోతుంది. ఇక అలా మైరావతి జరిగిన నిజాన్ని బట్ట బయలు చేస్తుంది.

ఇక మాటల్లో మాటగా మైరావతి మీ కోడలు నిజంగా దేవత అని చెప్పి జ్ఞానాంబను మార్చే ప్రయత్నం చేస్తుంది. గుర్తించి ఇప్పటి నుంచైనా వాళ్ళను కళ్ళల్లో పెట్టుకుని చూసుకో లేదంటే నీ ఇష్టం అని చెబుతుంది. దాంతో జ్ఞానాంబ అక్కడినుంచి మౌనంగా వెళ్ళి పోతుంది.

Advertisement

ఆ తర్వాత దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ జ్ఞానాంబ గారు అంటూ గట్టిగా అరుచుకుంటూ వస్తాడు. అలా వచ్చిన దిలీప్ కుటుంబీకులు జానకిపై వేరే విధంగా జానకి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ విరుచుకుపడతారు. కానీ అసలు సంగతి ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ నిజం చెప్పాలంటే జానకి మాత్రం టెన్షన్ పడుతుంది. ఇక జ్ఞానాంబకు ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది.

దీని తరువాయి ఎపిసోడ్ లో జ్ఞానాంబ ఒకచోట కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది. మరో వైపు జానకి ఎంతో బాధతో ఏడుస్తుంది. ఇంకో వైపు మల్లిక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది. వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ కి కారణం ఏమై ఉంటుంది ? తెలుసుకోవాలంటే రేపటి వరకు ఎదురు చూడక తప్పదు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel