Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam: ఆనంద్ చుట్టూ హిమా.. మందలించిన వంటలక్క, సౌందర్య?

Karthika Deepam March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటున్న మనందరికీ తెలిసిందే. టిఆర్పి రేటింగ్

By Ramesh Babu

Published on: March 1, 2022 9:18 AM

Updated on: March 1, 2022 6:31 PM

---Advertisement---

Karthika Deepam March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటున్న మనందరికీ తెలిసిందే. టిఆర్పి రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్ రోజు రోజుకీ ట్విస్ట్ లతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇక పోతే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

pjimage 58హిమ,సౌర్య ఆనంద్ తో ఆడుకుంటుండగా దీప వారిని చూసి బాధపడుతుంది. మరొకవైపు మోనిత కార్తీక్ కు కాల్ చేసి నా బాబు సంగతి ఏంటి వెతుకుతున్నావా లేదా అని అడుగడంతో, అప్పుడు కార్తీక్ వెతుకుతున్నాను పదేపదే కాల్ చేసి విసిగించకు అంటూ మోనిత ఫై తీసుకుపడతాడు. అప్పుడు మోనిత బాబు కు సంబంధించిన ఆధారాలు నాతో ఉన్నాయి అని అనగా నేను వచ్చి తీసుకుంటాను అని కార్తీక్ అంటాడు.

Advertisement

కార్తీక్ తన ఇంటికి వస్తున్నాడు అన్న ఆనందంలో మోనిత గంతులు వేస్తూ ఉండగా కాలు బెనుకుతుంది. మరొకవైపు హిమ ఎప్పుడు ఆనంద్ గురించి మాట్లాడుతూ ఉండటంతో సౌందర్య కోప్పడుతుంది. అప్పుడు హిమ తన నానమ్మను తప్పేంటి అనే సృష్టించడమే కాకుండా నువ్వు చాలా మారిపోయావు నానమ్మ అని అంటుంది. అది విన్న దీప హిమ ని గట్టిగా మందలిస్తుంది. ఇంకా మోనిత కార్తీక్ వస్తున్నాడు అని తన ఇంటిని అంతా పూలతో అలంకరించింది.

ఇక బాబుకు సంబంధించిన ఆధారం హాస్పిటల్లో ఉంది అని చెప్పి కార్తీక్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది మోనిత. ఆ ఆధారాలలో శ్రీవల్లీ,కోటేశ్వర్ ల పేర్లు తీసేస్తుంది. మరోవైపు సౌందర్య బాబును దత్తత ఇవ్వడానికి కార్యక్రమాలు చేస్తుండగా అక్కడికి వచ్చిన మోనిత, బాబు ని ఎందుకు దత్తత ఇస్తున్నారు అని ప్రశ్నిస్తుంది.

అప్పుడు సౌందర్య నువ్వు ఎవరివే అడగడానికి అని అడగగా.. ఆ బాబు కన్నతల్లిని అంటూ మోనిత బాంబు పేల్చింది. ఇది విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : 

Advertisement

, , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.