Guppedantha Manasu: దగ్గరైన వసు, రిషి..సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలేజీ రెండో డైరెక్టర్ గా జగతిని ఎంచుకున్నందుకు దేవయాని కుళ్ళు కుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి, దేవయాని ని ఓదారుస్తు పెద్దమ్మ మీ పెంపకంలో ఎలాంటి లోపం లేదు అని అంటాడు. కేవలం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కోసం మాత్రమే జగతి మేడం రెండవ డైరెక్టర్గా ఎంపిక చేసుకున్నాను అని అంటాడు.

Advertisement

అప్పుడు దేవయాని బయటకు సరే అన్నా కూడా లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి వాళ్ల పెదనాన్న మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నామని విషయం ఇచ్చుకుంటారు. ఇక అప్పుడు దేవయాని మరింత కుమిలిపోతూ ఉంటుంది. మరొకవైపు గౌతమ్, వసు లు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

అప్పుడు గౌతమ్ ఈ ఆనంద సమయంలో సెలబ్రేషన్స్ ను ఏ విధంగా ఏర్పాటు చేద్దాం వసు అని అడుగుతాడు. వీరిద్దరు మాట్లాడుకుంటున్నది దూరం నుంచి రిషి చూస్తూ ఉంటాడు. మరోవైపు గౌతమ్ ఇదే మంచి అవకాశం అన్నట్లుగా వసు తో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వసు గౌతమ్ కి చాక్లెట్ ఇచ్చి ఇదే స్వీట్ పార్టీ అని అనడంతో గౌతమ్ అప్ సెట్ అవుతాడు.

ఆ తర్వాత వసు, రిషి దగ్గరకు వెళ్లి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ రిషి మాత్రం కోపంగా వెళ్ళి పోతూ ఉంటాడు. అప్పుడు వసు రిషి చేయి పట్టుకుంటుంది. అప్పుడు రిషి ఏయ్ ఏంటిది అని అడగగా.. ఈరోజు మీరు ఏమీ మాట్లాడకుండా నాతోపాటు రండి అంటూ చెయ్యి పట్టుకుని మరీ తీసుకుని వెళుతూ ఉంటుంది.

Advertisement

అలా వారిద్దరూ కలసి హోలీ సెలబ్రేషన్స్ చోటికి వెళ్తారు. అక్కడికి వెళ్లగానే రిషి ఏంటిది వసు అని అడగగా అప్పుడు వసుధార ఒక్కసారిగా విజిల్ వేస్తుంది. దీంతో అక్కడున్న వారందరూ డ్రమ్స్, రంగులు తీసుకొని వస్తారు. అప్పుడు రిషి, వసు లు కూడా ఆనంద రంగులు పూసుకుంటూ రొమాంటిక్ గా హోలీని జరుపుకుంటూ ఉంటారు.

అలా రంగులు పూసుకుంటూ వసు ని ఒక్కసారిగా టచ్ చేస్తాడు రిషి. అలా వారు కొద్ది సేపు అలానే ఉండి పోతారు. ఆ తరువాత ఇద్దరూ ఆనందంగా ఒకచోట కూర్చొని హోలీ ఆడడం అందుకు ఆనందంగా ఉంది అంటూ ఇద్దరూ కలిసి సెల్ఫీలు తీసుకుంటారు. రంగులతో రిషి అలాగే ఇంటికి వెళ్లడంతో అది చూసి దేవయాని కుళ్ళు కుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel