Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

హోలీ ఆడి అలసిపోయిన రిషి, వసు ఒక వైపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసు ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు అని అడగగా చాలా బాగుంది అని అంటాడు రిషి. రంగులన్నీ కలగలసి నాతో మాట్లాడినట్టుగా ఉంది అని వసు తో అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గుర్తుగా సెల్ఫీ తీసుకుంటారు. మరొకవైపు ఫణీంద్ర పేపర్ చదువుతూ ఉండగా కోపంతో దేవయాని ఆ పేపర్ లాక్కుని విసిరి కొడుతుంది.
ఏమైంది దేవయాని అని అడగగా నేను ఇంత కోపం తో ఉంటే మీరు కూల్ గా పేపర్ చదువుతున్నారా అని అంటుంది. మరి అందుకు నేను ఏం చేయాలి అని అంటారు ఫణీంద్ర. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మొత్తం రంగులతో నిండి పోయిన రిషి ఇంటికి వస్తాడు.రిషి చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఫణీంద్ర హ్యాపీ హోలీ అని చెబుతాడు. అప్పుడు రిషి రూమ్ లోకి వెళ్ళగా రిషి రంగులతో చూసిన గౌతమ్ ఎక్కడికి వెళ్లావురా ఎవరితో కలిసి హోలీ ఆడావు అని అడుగుతాడు. కాని రిషి మాత్రం ఆనందంలో గౌతమ్ కి సమాధానం ఇవ్వకపోవడంతో గౌతమ్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు హోలీ వేడుకలను గుర్తు చేసుకుని వసు ఆనందంగా ఉంటుంది.
రిషి కూడా హోలీ సెలబ్రేషన్స్ ను గుర్తు తెచ్చుకొని మనసులో థాంక్స్ వసుధార అని అనుకుంటూ ఉంటాడు. అలా కొద్దిసేపు వారిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఫోన్ లో మాట్లాడుకుంటారు. ఈ రోజు కాలేజీ లో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి కాలేజీ స్టాప్ వసు ని అడుగుతుండు కదా అప్పుడు వసు సార్ వచ్చాక మాట్లాడుకుందాం అని అంటుంది.
ఇంతలో రిషి అక్కడికి వచ్చి కాలేజ్ స్టాఫ్ మాట్లాడిన మాటలు అన్నీ వింటాడు. ఆ తరువాత రిషి మహేంద్ర దగ్గరకు వెళ్లి నేను మీటింగ్ కి రావడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసు, రిషి లు చెస్ ఆడదాం అని పందెం వేసుకుంటారు. అలా కొద్దిసేపు వారి మధ్య రొమాంటిక్ గా సాగుతోంది. ఈ క్రమంలోనే రిషి, వసు కి ముద్దు పెట్టబోతాడు.
- Guppedantha Manasu july 7 Today Episode : రిషి ఆలోచనలతో సతమతమవుతున్న వసు.. వసుని గెట్ అవుట్ అంటూ అవమానించిన జగతి..?
- Guppedantha Manasu january 03 Today Episode : రిషి ఫ్యామిలీని చంపేస్తానని చెప్పిన రాజీవ్.. వసు మెడలో తాళికట్టబోతున్న రిషి?
- Guppedantha Manasu july 19 Today Episode : వసుధారని పొగిడిన రిషి.. సాక్షికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రిషి..?















