Vivo V60 5G : వావ్.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త వివో V60 5G ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. లాంచ్ ఎప్పుడంటే?

Updated on: August 4, 2025

Vivo V60 5G : వివో నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. వివో నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ వివో V60 5G లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వివో V50 అప్‌‌గ్రేడ్ ప్రముఖ జైస్-ట్యూన్డ్ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

ఈ ఏడాదిలో కంపెనీ డిస్‌‌ప్లే, పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌లను IP68, IP69 రేటింగ్‌ను అందిస్తుంది. కంపెనీ మైక్రోసైట్ ద్వారా కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు, కలర్ వేరియంట్‌లను కూడా రివీల్ చేసింది. రాబోయే వివో V60 5G ఫోన్ ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo V60 5G భారత్ లాంచ్ తేదీ :

రాబోయే వివో V సిరీస్ ఫోన్ ఆగస్టు 12న లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. అభిమానులు కంపెనీ అధికారిక YouTube ఛానెల్‌లో లాంచ్‌ ఈవెంట్ లైవ్ ద్వారా వీక్షించవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం కంపెనీ సోషల్ మీడియాను ఫాలో అవ్వండి.

Advertisement

Read Also : Vivo Y400 5G : కొత్త వివో Y400 5G వచ్చేసిందోచ్.. AI ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతో తెలుసా?

Vivo V60 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :

వివో V60 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో రావచ్చు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 కలిగి ఉంది. ఈ వివో ఫోన్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు LPDDR4x టైప్ RAM, 512GB UFS 2.2తో రావచ్చు. 90W వైర్డ్ ఛార్జింగ్‌, 6,500mAh బ్యాటరీ రావచ్చు.

అభిషేక్ యాదవ్ ప్రకారం.. ఈ వివో V60 ఫోన్ FunTouch OS 15పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. వివో V60 5G ఫోన్ 50MP సోనీ IMX766 సెన్సార్, OISతో, 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో రావచ్చు. సెల్ఫీల కోసం ఈ ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరాతో రానుంది.

Advertisement

భారత్‌లో వివో V60 5G ధర (అంచనా) :

నివేదికల ప్రకారం.. వివో V60 5G ఫోన్ ధర రూ. 35,999గా ఉండగా, టాప్ వేరియంట్ ధర దాదాపు రూ. 39,999గా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, కచ్చితమైన ధరలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. Flipkart, Vivo e-store, ఇతర రిటైల్ ఛానెల్‌లలో అందుబాటులో ఉంటుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel