PM Kisan 20th Installment Date : పీఎం కిసాన్ 20వ విడత ఈ తేదీనే విడుదల? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలంటే?

Updated on: July 12, 2025

PM Kisan 20th Installment Date 2025 : దేశవ్యాప్తంగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలైలో 12 రోజులు గడిచాయి. కానీ, ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడతలో రూ. 2,000 బ్యాంకు ఖాతాలో పడలేదు. చాలా మంది రైతుల్లో (PM Kisan 20th Installment Date) ఒక ప్రశ్న వినిపిస్తోంది. రూ. 2000 ఎప్పుడు వస్తాయి? మీరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం కోసం చూస్తుంటే.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతకు సంబంధించిన కొత్త అప్‌డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 2000 ఎప్పుడు వస్తాయి? :

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూ.2000 కోసం రైతులు వేచి చూస్తున్నారు. జూన్ 20న ప్రధాని మోదీ రైతుల బ్యాంకు ఖాతాల్లో 20వ విడత జమ చేసేవారు. అయితే, జూలైలో ఇప్పుడు 12 రోజులు గడిచాయి. కానీ, అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత జూలై 19న రావచ్చు. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు.

PM Kisan 20th Installment Date 2025 : 20వ విడత జూలై 19న వస్తుందా? :

ఇప్పటివరకు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19 వాయిదాలు విడుదలయ్యాయి. ఈ వాయిదాలన్నింటినీ ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేశారు. అయితే, ఇప్పుడు ప్రధాని మోదీ జూలై 18న బీహార్‌లోని మోతీహరిలో పర్యటించనున్నారు. జూలై 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం పీఎం కిసాన్ రూ.2వేలు విడుదల చేసే అవకాశం ఉంది.

Advertisement

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత తేదీ.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకుంటే రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?

రూ. 2000 వాయిదా ఆగకుండా ఉండాలంటే ఏమి చేయాలి? :

  • ఫుల్ e-KYC పూర్తి చేసి ఉండాలి.
  • ఆధార్, బ్యాంకు అకౌంట్ లింక్‌ చేసి ఉండాలి.
  • బ్యాంక్ వివరాలు (IFSC, అకౌంట్ నంబర్) సరిగ్గా ఉండాలి.
  • భూమి రికార్డులను అప్‌డేట్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి.
  • లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేయండి

పీఎం కిసాన్ యోజన 20వ విడత స్టేటస్ కోసం pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. రైతు కార్నర్‌లోని (PM Kisan 20th installment Date 2025) లబ్ధిదారుడి స్టేటస్ క్లిక్ చేసి, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, డేటాపై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై, డబ్బు వచ్చిందా? ప్రాసెస్‌లో ఉందా లేదా లోపం ఉందా అనే ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు.

PM Kisan 20th installment Date 2025 FAQs in Telugu :

1. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల అవుతుంది?
Ans : 2025లో పీఎం కిసాన్ 20వ విడత జులైలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అధికారిక తేదీని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.

Advertisement

2. పీఎం కిసాన్ 20వ విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
Ans : అధికారిక pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి. “Beneficiary Status” ఆప్షన్ క్లిక్ చేసి Aadhaar లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేయవచ్చు.

3. పీఎం కిసాన్ 20వ విడత కోసం ఉండాల్సిన అర్హతలు ఏంటి?
Ans : ఈ పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ చేసుకున్న రైతులు ఏడాదికి రూ. 6000 అర్హత పొందుతారు. కేవలం అగ్రికల్చర్ భూమి కలిగి ఉండే రైతులు మాత్రమే అర్హులు.

4. పీఎం కిసాన్ పథకం కింద మొత్తం ఎన్ని విడతలు వచ్చాయి?
Ans : ఇప్పటివరకు 19 విడతలు విడుదల అయ్యాయి. ఇప్పుడు 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

5. పీఎం కిసాన్ 20వ విడత సమాచారం ఎక్కడ తెలుసుకోవచ్చు?
Ans : అధికారిక సమాచారం కోసం pmkisan.gov.in లేదా రాబోయే ప్రభుత్వ ప్రకటనల ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel