Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

PM Kisan : రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేదీ ఇదిగో.. మీ పేరు ఉందా చెక్ చేసుకోండి..!

Pm Kisan Samman Nidhi 20th installment Date : లక్షలాది మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2,000 నేరుగా బదిలీ చేయాల్సి ఉంది. నివేదిక ప్రకారం.. ఈ నెల 18న పీఎం కిసాన్ 20వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.

By Vinod Kumar

Published on: July 17, 2025 10:19 AM

Updated on: July 17, 2025 10:19 AM

Pm Kisan Samman Nidhi 20th installment

---Advertisement---

Pm Kisan Samman Nidhi 20th installment Date : పీఎం కిసాన్ రైతులు 20వ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మునుపటి వాయిదా కన్నా ఈసారి త్రైమాసిక విడత వాయిదా ఆలస్యం అయింది. దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) 20వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Pm Kisan Samman Nidhi 20th installment) విడుదల చేయనున్నట్లు నివేదికలు తెలిపాయి. నివేదిక ప్రకారం.. ప్రధానమంత్రి జూలై 18న బీహార్‌లోని మోతిహరి (తూర్పు చంపారన్)లో జరిగే పెద్ద బహిరంగ సభలో 20వ విడత రూ. 2,000 ప్రకటించనున్నారు.

PMKSNY వాయిదాలు త్రైమాసికానికి ఒకసారి విడుదల అవుతాయి. గతంలో 19వ విడత ఫిబ్రవరిలో విడుదలైంది. దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్లకు పైగా రైతులకు PM-KISAN పథకం 19వ విడత బదిలీ అయింది. లబ్ధిదారులందరికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా రూ. 22,000 కోట్లకు పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందింది. అయితే, ఈ త్రైమాసికంలో లబ్ధిదారులకు వాయిదా ఆలస్యమైంది. లక్షలాది మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2,000 నేరుగా బదిలీ చేయాల్సి ఉంది. నివేదిక ప్రకారం.. ఈ నెల 18న పీఎం కిసాన్ 20వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.

Advertisement

PM Kisan Yojana : PMKSNY రైతులు గుర్తుంచుకోవలసిన విషయాలివే :

1. మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డుకు లింక్ చేయండి.
2. బ్యాంక్ అకౌంట్ స్టేటస్ ఆధార్ లింక్‌ను చెక్ చేయండి.
3. మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలో DBT ఆప్షన్ యాక్టివ్‌గా ఉంచండి.
4. మీ e-KYC పూర్తి చేయండి.
5. PM కిసాన్ పోర్టల్‌లోని ‘Know Your Status’ ఆప్షన్ కింద మీ ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేయండి.

PM Kisan Yojana : మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఎలా చెక్ చేయాలి? :

1. అధికారిక PM KISAN వెబ్‌సైట్ పోర్టల్‌ (https://pmkisan.gov.in/) క్లిక్ చేయండి.
2. Payment Success ట్యాబ్ కింద భారత్ మ్యాప్ పక్కన “Dashboard” అనే ఎల్లో కలర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3. గ్రామ డాష్‌బోర్డ్ ట్యాబ్‌లో అవసరమైన వివరాలను నింపండి.
4. మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, గ్రామపంచాయతీని ఎంచుకోండి.
5. మీ వివరాలను ఎంచుకోండి.
6. ‘Get Report’ బటన్‌ను క్లిక్ చేయండి.
7. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు చెక్ చేయండి.

Read Also : PM Kisan 20th Installment Date : పీఎం కిసాన్ 20వ విడత ఈ తేదీనే విడుదల? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలంటే?

PMKSNY పోర్టల్‌లో ల్యాండ్ అడ్రస్ ఎలా అప్‌డేట్ చేయాలి? :

1. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ (https://pmkisan.gov.in/) ను సందర్శించండి.
2. హోమ్‌పేజీలో ‘Farmers Corner’ ట్యాబ్ కింద, ‘State Transfer Request’ పై క్లిక్ చేయండి.
3. మీ ‘Registration Number’ లేదా ‘Aadhaar Number’ నింపండి.
4: స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయండి.
5: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
6. మీ పేరు మీద ‘proof of cultivable land’ (భూమి రికార్డులు, ఖస్రా/ఖాటోని) అప్‌లోడ్ చేయండి.
7. అన్ని వివరాలను రివ్యూ చేసి ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో Submit చేయండి.

Advertisement

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.