Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Ys Jagan : ఏపీ ప్రభుత్వానికి షాక్… సమ్మె బాట పట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు !

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో వివాదం తలెత్తుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు సినిమా టికెట్ వివాదం, ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్‌ ప్రభుత్వం సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్‌ పేల్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది ప్రకటించి ఊహించని షాక్‌ ఇచ్చారు. పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు ద‌శ‌ల వారి ఉద్యమానికి ... Read more

By Ramesh Babu

Published on: January 23, 2022 4:17 PM

Updated on: January 23, 2022 4:59 PM

---Advertisement---

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో వివాదం తలెత్తుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు సినిమా టికెట్ వివాదం, ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్‌ ప్రభుత్వం సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్‌ పేల్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది ప్రకటించి ఊహించని షాక్‌ ఇచ్చారు.

పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు ద‌శ‌ల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ( హంస‌) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేష‌న్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ ( ఏపీ హంస‌) అధ్యక్షుడు అర‌వ పాల్ వెల్లడించారు. పీఆర్సీ జివోలు ర‌ద్దు చేయాలని.. చర్చలు ముగిసే వ‌ర‌కు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 11 పీఆర్సీ పై అశితోష్ మిశ్రా క‌మిటీ నివేదిక‌ను అమ‌లు చేయాలని… ఈ పోరాటంలో డాక్టర్లు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు.

దీని వల్ల క‌రోనా, ఇత‌ర వైద్య సేవ‌ల‌కు కొంత అంత‌రాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యుల‌ర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ఈ పోరాటంలో పాలు పంచుకుంటారని వారు తెలిపారు. తమ డిమాండ్లు ప‌రిష్కారం కాకుంటే అత్యవసర వైద్య సేవ‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. పెద్ద మనస్సుతో ఏపీ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. మరి ఇప్పుడు సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు.

Read Also : మన భారతీయ నదుల గురించి ఆస్తకిరమైన వాస్తవాలు ఇవే..!

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!