Viral Video : లేచిన వేళ బాగుంది.. స్కూటర్‌లో భగ్గుమన్న మంటలు.. దంపతులు తెలివిగా ఎలా తప్పించుకున్నారో చూడండి..!

Viral Video : దంపతులు స్కూటర్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన మహిళ వెంటనే భర్తను అప్రమత్తం చేసింది. ఏమాత్రం ఆలోచించకుండా స్కూటర్ స్టాండ్ వేసిన అతడు దూరంగా పరిగెత్తాడు. మంటలు ఎక్కువ కావడంతో చుట్టు పక్కల ఉన్నవారంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికి వారు తమ చేతుల్లో దొరికిన నీళ్లు తీసుకొచ్చి స్కూటర్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

Viral Video Bystanders Jump Into Action As Scooter Catches Fire
Viral Video Bystanders Jump Into Action As Scooter Catches Fire

అంతటితో ఆగకుండా మరికొందరు ఒక్కొక్కరుగా బాటిళ్లలో నీళ్లు తీసుకొచ్చి స్కూటర్ మంటలను ఆర్పేశారు. మరో వ్యక్తి ఏకంగా అగ్నిమాపక యంత్రాన్ని తీసుకొచ్చి స్కూటర్‌పై స్ప్రే చేశాడు. అంతే.. స్కూటర్ మంటలు అదుపులోకి వచ్చేశాయి. అంతా సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్నింది. లేదంటే ఆ ఇద్దరు దంపతులు ప్రాణపాయం కలిగేది. అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు ఈ వీడియో రికార్డు అయింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Viral Video : లక్కీగా ఎస్కేప్ అయిన జంట.. ఎంత ప్రమాదం తప్పింది

ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది గంటలకే వైరల్ అయింది. సీసీటీవీ ఫుటేజీలో ఒక జంట స్కూటర్‌పై వస్తున్నట్లు కనిపిస్తోంది. మహిళ కిందకు దిగిన సమయంలో స్కూటర్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన ఆ మహిళ వెంటనే స్కూటర్ పై కూర్చొన్న వ్యక్తిని హెచ్చరించింది. వెంటనే అతడు మంటలను చూసి భయాందోళనకు గురయ్యాడు.

Advertisement

Advertisement

ఆ వ్యక్తి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా పక్కనే ఉన్నవారు రంగంలోకి దిగారు. అందరూ నీళ్లను తీసుకొచ్చి మంటలను ఆర్పేశారు. ఏది ఏమైనా అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ వీడియోకు చూసిన నెటిజన్లు మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చినవారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం వల్లనే పెను ప్రమాదం తప్పిందని కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Viral Video : సింహాన్ని గాల్లోకి ఎగిరేస్తూ.. ఓ ఆట ఆడేసుకున్న గేదెలు, మామూలుగా లేదుగా.. వీడియో వైరల్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel