Viduru Niti : జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు విషయాలనూ వదులుకుంటే చాలు: విదురు నీతి

Viduru Niti : ప్రస్తుత కాలంలో చాలామంది వారు చేసే కొన్ని పొరపాట్ల వల్ల చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో  పనిచేసిన విదురుడు అనే వ్యక్తి చాలా గొప్పవాడు. ఆయనకి ఉన్న జ్ఞానం వల్ల హస్తిరాపురానికి ప్రధానమంత్రిగా వ్యవహరించే అర్హత పొందాడు. విదురుడు ఒక మహా జ్ఞాని. భూత భవిష్యత్ గురించి మాత్రమే కాకుండా న్యాయ అన్యాయాల గురించి కూడా చాలా చక్కగా వివరించేవాడు. అందువల్ల హస్తినాపురం మహారాజు అయిన ధృతరాష్ట్రుడు విదురుడి సలహాల మేరకు రాజ్యపాలన కొనసాగించేవాడు. విదురుడు, మహారాజు ధృతరాష్ట్ర మధ్య జరిగిన సంభాషణల సమాహారాన్ని విదుర్ నీతి అంటారు.

Viduru Niti
Viduru Niti

విదుర్ నీతి ప్రకారం ప్రస్థుత కాలంలో మనం మూడు విషయాలకు దూరంగా ఉండటం వల్ల జీవితంలో గొప్ప స్థాయికి ఎదగవచ్చు. మన జీవితంలో సంతోషాన్ని నాశనం చేసే 3 విషయాలను విదుర నీతిలో ప్రస్తావించారు. మన జీవితంలో సక్సెస్ కావాలంటే ఆ మూడు విషయాలకు దూరంగా ఉండాలని విదురు నీతిలో పేర్కొన్నారు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

విదురు నీతి : విదురుడు తననీతి శాస్త్రం ద్వారా తెలిపారు

ముఖ్యంగా మానవుడు తన జీవితంలో కోపాన్ని వదులుకోవాలి. విదుర నీతి ప్రకారం అధిక కోపం ఒక మనిషి ఆలోచన శక్తిని, మనస్సాక్షి రెండింటినీ నాశనం చేస్తుంది. అధిక కోపం వల్ల ఏ వ్యక్తికైనా ఆలోచించే శక్తి కోల్పోతాడు. అధిక కోపం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతారు . అంతే కాకుండా కొన్నిసార్లు కోపంలో మనం ఏం చేస్తున్నామో తెలియకుండానే తప్పులు చేస్తుంటాము. అందువల్ల పూర్వకాలంలో విదురుడు కోపాన్ని వినాశనానికి మూలంగా భావించాడు. విదుర నీతి ప్రకారం కోపాన్ని వదులుకోవటం వల్ల జీవితంలో సక్సెస్స్ సాధించవచ్చు.

Advertisement

అలాగే మనిషి జీవితంలో మితిమీరిన కామం కూడా వారి నాశనానికి కారణమవుతుంది. ప్రతి వ్యక్తి వారి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. మితిమీరిన కామం వల్ల ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా బలహీనపడతాడు. మితిమీరిన కామ వాంఛల వల్ల మనిషి జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల విదుర నీతి ప్రకారం కామాన్ని వదులుకోవాలి.

Viduru Niti
Viduru Niti

Viduru Niti:

అలాగే విదుర నీతి ప్రకారం అత్యాశ కూడ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. అత్యాశ కలిగిన వ్యక్తి అతని జీవితంలో ఎప్పుడు సంతృప్తి పడలేడు. అత్యాశ కలిగిన వ్యక్తులలో దురాశ వల్ల తప్పొప్పులను నిర్ణయించే శక్తిని కోల్పోతారు. అందువల్ల మనిషి జీవితంలో అత్యాశను వదులుకోవటం వల్ల వారి జీవితంలో విజయం పొందవచ్చనీ తెలిపారు ఈ మూడింటిని వదులుకుంటే జీవితం విజయ బాటలో కొనసాగుతుందని విదురుడు తననీతి శాస్త్రం ద్వారా తెలిపారు.

Read Also : Chanakya Niti : ఆచార్యుడు ఆనాడే చెప్పాడు.. ఇలా చేస్తే.. ధనవంతులు కావడం ఖాయం..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel