వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

PM Modi : ప్రధాని మోదీని చంపేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఓ ఆగంతకుడు జాతీయ దర్యాప్తు సంస్థ కు మెయిల్ పంపాడు. అలాగే తన వద్ద ఉన్న 20 కిలోల ఆర్డీఎస్క్ తో దేశ వ్యాప్తంగా వేల మందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అందులో వివరించాడు. మొత్తం 20 ప్రాంతాల్లో దాడులకు పథకం వేసినట్లు పేర్కొన్న ఆగంతకుడు 2 కోట్ల మందిని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వివరించాడు. అలాగే వీలైనంత త్వరగా ప్రధాని మోదీని ... Read more

By Vinod Kumar

Published on: April 1, 2022 3:56 PM

Updated on: April 2, 2022 7:28 PM

---Advertisement---

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఓ ఆగంతకుడు జాతీయ దర్యాప్తు సంస్థ కు మెయిల్ పంపాడు. అలాగే తన వద్ద ఉన్న 20 కిలోల ఆర్డీఎస్క్ తో దేశ వ్యాప్తంగా వేల మందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అందులో వివరించాడు. మొత్తం 20 ప్రాంతాల్లో దాడులకు పథకం వేసినట్లు పేర్కొన్న ఆగంతకుడు 2 కోట్ల మందిని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వివరించాడు. అలాగే వీలైనంత త్వరగా ప్రధాని మోదీని చంపేస్తానని ప్రకటించాడు.

ఆర్​డీఎక్స్​ దాడులకు సంబంధించి దేశంలో 20 మంది స్లీపర్ సెల్ప్ పని చేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు వివరించాడు. ప్రధాని మోదీకి బెదిరింపు ఈ-మెయిల్‌ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ అప్రమత్తమైంది. అంతే కాకుండా తమకు వచ్చిన ఆ-మెయిల్ ను ఎన్ఐఏ వివిధ ఏజెన్సీలతో పంచుకుంది. మరోవైపు ఈ-మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది. అలాగే ప్రధాని మోదీ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

Read Also : Every Three Years Marriage : మూడేళ్లకొకసారి విడాకులు, మళ్లీ పెళ్లి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel