Upasana : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న ఉపాసన.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోస్!

Updated on: September 6, 2022

Upasana : దేశమంతా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వినాయక చవితి పండుగను చాలా ఘనంగా నిర్వహించి గణేష్ నిమజ్జనాన్ని కూడా ఎంతో ఘనంగా పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా మెగా అభిమానులు ఆనందపడే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరి పెళ్లి జరిగి దాదాపు పది సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా పిల్లల్ని కనలేదు. దీంతో ప్రతిసారి ఉపాసనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

upasana
upasana

Upasana :తల్లి కాబోతున్న ఉపాసన.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోస్..

అయితే చాలా సందర్భాలలో ఉపాసన ఈ విషయం గురించి స్పందిస్తూ పిల్లల్ని కనడం నా వ్యక్తిగతమైన విషయం అంటూ చాలా ఘాటుగా సమాధానాలు ఇచ్చింది. ఇక ఇటీవల సద్గురు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన ఈ విషయం గురించి సద్గురు వద్ద వివరించింది. దీంతో పిల్లల్ని కనని వారికి మంచి బహుమతి ఇస్తానని సద్గురు చెప్పటంతో ..ఉపాసన ఆ బహుమతి తీసుకోవటానికి సిద్దంగా లేనని వెల్లడించింది. దీంతో ఎప్పటికైనా మెగా కుటుంబానికి వారసుడు వస్తాడని అభిమానులు రిలాక్స్ అయ్యారు.

అయితే ఇంతకాలం మెగా వారసుడి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక తొందర్లోనే నెరవేరేలా కనిపిస్తోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా పాల్గోన్నారు. ఈ క్రమంలో మెగా కోడలు ఉపాసన కూడా గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఉపాసన బేబీ బంప్ తో ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా రామ్ చరణ్ ఉపాసన కలసి గణేష్ విగ్రహాన్ని పట్టుకున్న ఫోటోలో కూడా ఉపాసన బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉపాసనకు బేబీ బంప్ కి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Read Also : Ram Charan-Upasana : చరణ్, ఉపాసన వరలక్ష్మి వ్రతం చూశారా? కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel