New Traffic Rules : హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే మూడు నెలలు లైసెన్స్ రద్దు..!

Updated on: April 8, 2022

New Traffic Rules : ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో శిరస్త్రాణం లేకుండా వాహనంపై వెళ్లే వారికి మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా జరిమానా కూడా విధిస్తామని వివరించారు. ఆ తర్వాత శిరస్త్రాణం లేకుండా బైక్ నడిపిన వ్యక్తిని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి… అక్కడ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తామని వివరించారు.

అలాగే ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు హారన్ లు మోగించకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా హారన్ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్ టైం వెయిటింగ్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం… రెడ్ సిగ్నల్ వద్ద అత్యథికంగా హారన్ లు కొడ్తూ.. వాహనదారులు శబ్ధ కాలుష్యాన్ని సృష్టించడమే. దీన్ని అరికట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు.

Read Also : Google play store: యాప్ లకు షాక్ ఇచ్చిన గూగుల్.. ప్లే స్టోర్ యాప్ అప్డేట్ తప్పనిసరి!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel