Traffic new rules : హెల్మెట్ పెట్టుకున్నా పట్టీ పెట్టకపోతే వెయ్యి రూపాయల ఫైన్ అంట.. వామ్మో!

Updated on: May 21, 2022

Traffic new rules : ఐఎస్ఐ మార్కు లేని హెల్మెట్ వాడినా, హెల్మెట్ పెట్టుకొని పట్టీ పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే సిగ్నల్ జంప్ చేస్తే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామని వివరించింది. అయితే హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ… ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ లను నిషేదిస్తూ… 2021లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా మంది ఈ రూల్స్ పాటించడం లేదు. దీంతో కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్ 1998లో మార్కులు తీసుకు వచ్చింది. రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చలాన్లు తప్పించుకోవడం కోసం కొందరు హెల్మెట్ ను తలకు తగిలించుకోవడం తప్పితే దానుకున్న బటన్/బకిల్ ను తగిలించుకోవడం తప్పితే దానికున్న పెట్టుకోవడం లేదు. ఇలాంటి చర్యల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ తలపై నుంచి ఎగరిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది.

Traffic new rules
Traffic new rules

నిబంధనలు, జరిమానాలు ఇలా…

  • బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తలకు పెట్టుకున్నప్పటికీ.. దాని పట్టీ/బ్యాండ్ పెట్టుకోకుంటే వెయ్యి ఫఐన్.
  • వాడే హెల్మెట్ బ్యూరో ఆఫ్ ఉండియా స్టాండర్డ్స్ సర్టిఫికేట్ లేదా ఐఎస్ఐ మార్కు ఉన్నవై ఉండాలి. ఇవి తప్ప వేరే హెల్మెట్లు వాడితే వెయ్యి రూపాయల జరిమానా.
  • ఐస్ఐ మార్కులేని హెల్మెట్ ధరించి దానికున్న పట్టీ సరిగ్గా పెట్టుకోకపోతే.. రెండు ఉల్లంఘనల కింద రెండు వేల రూపాయల ఫైన్ కట్టాల్సిందే.
  • హెల్మెట్ ను కరెక్ట్ గా పెట్టుకున్నప్పటికీ… రెడ్ సిగ్నల్ ను జంప్ చేసినా, ట్రాఫక్ రూల్స్ ఉల్లంఘించినా రెండు వేల వరకు జరిమానా పడుతుంది. పైగా 3 నెలల పాటు లైసెన్స్ జరిమానా పడుతుంది. పైగా 3 నెలల పాటు లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంది.
    Read Also : New Traffic Rules : హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే మూడు నెలలు లైసెన్స్ రద్దు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel