Telegram New Features : టెలిగ్రామ్‌లో సరికొత్త ఫీచర్స్.. ఇక వాట్సాప్‌ వదిలేస్తారు..!  

Telegram New Features : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు యూజ్ చేసే యాప్స్‌లో ‘వాట్సాప్’ కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు. మెసేజింగ్ యాప్స్‌లో నెంబర్ వన్ వాట్సాపే అని అందరూ భావిస్తుంటారు. కాగా, అందులో లేని ఫీచర్స్‌ను  టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆ సరికొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఐ మెసేజ్ స్టైల్ రియాక్షన్ టూల్ ద్వారా టెక్స్ట్ లోని పార్ట్స్‌ను దాచడానికి చమత్కార స్పాయిలర్ ఫీచర్స్ అందిస్తుంది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఈ  సహాయకరమైన ఫీచర్ మెసేజ్ కూడా ట్రాన్స్ లేట్ చేస్తుంది. మెసేజింగ్ యాప్స్‌లో ఎందులో అందుబాటులో లేని ఈ ఫీచర్స్  టెలిగ్రామ్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.

డైనమిక్, యానిమేటేడ్ ఎమోజీలను పరిచయం చేసిన ఫస్ట్ మెసేజింగ్ సాఫ్ట్‌వేర్ టెలిగ్రామ్ కావడం విశేషం. ఈ ఫీచర్స్ ద్వారా టెలిగ్రామ్ వినియోగదారులు తమ చాట్‌లలో డిఫరెంట్ ఎమోజీస్ యూజ్ చేసుకోవచ్చు. అలా టెలిగ్రామ్ వినియోగదారులకు ఈ ఎమోజీలు కమ్యూనికేషన్ పరంగా ఉపయోగపడతాయి. మెసేజెస్‌కు రియాక్ట్ కావడానికి థంబ్స్ అప్ రియాక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి పంపడానికిగాను యాప్‌లో ఉండే ఎమోజీని రెండుసార్లు క్లిక్ చేస్తే చాలు.. వచ్చేస్తాయి. ఇక అడిషనల్ ఎమోజీస్ కూడా సెండ్ చేసుకోవచ్చు.

Advertisement

స్పాయిలర్‌ను ఉపయోగించి టెక్స్ట్‌లోని విభాగాన్ని దాచుకోవచ్చు. టైప్ చేస్తున్నప్పుడు కొత్త ‘స్పాయిలర్’ ఫార్మాటింగ్‌‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.ఇకపోతే మెసేజ్ ట్రాన్స్ లేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఈ ట్రాన్సలేషన్ ఫీచర్‌ను స్టార్ట్ చేయడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ భాషలను ఎంచుకుని ట్రాన్సలేషన్ బటన్ క్లిక్ చేస్తే చాలు. మెసేజ్ ట్రాన్స్ లేట్ అయిపోతుంది. అయితే, భాషలను మీ ఫోన్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా అందుబాటులో ఉన్న వాటిని బట్టి డిసైడ్ చేసుకోవాలి.

Read Also : Whatsapp Profile Hide Trick : మీ వాట్సాప్ ప్రొఫైల్‌లో పేరు కనిపించకుండా ఇలా చేయొచ్చు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel