Whatsapp Profile Hide Trick : మీ వాట్సాప్ ప్రొఫైల్‌లో పేరు కనిపించకుండా ఇలా చేయొచ్చు..!

Whatsapp Profile Hide Trick Whatsapp Profile Name Can Invisible to Others with This Trick
Whatsapp Profile Hide Trick Whatsapp Profile Name Can Invisible to Others with This Trick

Whatsapp Profile Hide Trick : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. కొన్ని ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరికొన్ని టెస్టింగ్ దశలో ఉన్నాయి. వాట్సాప్ కొత్ అప్ డేట్ తీసుకోస్తోంది. అయితే ఎన్ని అప్ డేట్స్ వచ్చినా వాట్సాప్ తెలియని చాలా విషయాలు ఉన్నాయి. వాట్సాప్ లో చాలామంది యూజర్లు ప్రైవసీ కోరుకుంటారు.. తమ గురించి అవతలి యూజర్ కు తెలియకుండా ఉండాలని భావిస్తుంటారు.

అలాంటి యూజర్లు ఈ ట్రిక్ ద్వారా ఈజీగా వాట్సాప్ లో కొన్నింటిని హైడ్ చేసుకోవచ్చు. సాధారణంగా వాట్సాప్ అకౌంట్ ఉన్న ప్రతిఒక్కరికి ప్రొఫైల్ కామన్.. వాట్సాప్ ప్రొఫైల్ ఆధారంగానే ఆ యూజర్ ఎవరు అనేది గుర్తు పట్టొచ్చు. మీ వాట్సాప్ అకౌంట్లో మీ ప్రొఫైల్ పేరు ఇతరులకు కనిపించకుండా హైడ్ చేయాలంటే ఈ ట్రిక్ అప్లయ్ చేయండి.. మీరు చేయాల్సిందిల్లా.. ఈ కింది విధంగా ఫాలో అవ్వడమే..

Advertisement

WhatsApp అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో ప్రొఫైల్ పేరు సెక్షన్ Empty వదిలేయడానికి అనుమతించదు. ఒకవేళ మీరు ప్రొఫైల్ నేమ్ రాస్తే అది తప్పకుండా అందరికి కనిపిస్తుంది. ప్రొఫైల్ పేరు ఎంటర్ చేయకుండా వాట్సాప్ ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం..

– ముందుగా మీ మొబైల్ లేదా PCలో వాట్సాప్ యాప్‌ ఓపెన్ చేయండి.
– : ⇨ ఈ రెండు సింబల్స్ కాపీ చేయండి.
– Settingsలోకి వెళ్లండి.
– ప్రస్తుత వాట్సాప్ Profile Press చేయండి. పెన్సిల్ సింబల్‌పై నొక్కండి.
– మీరు కాపీ చేసిన : ⇨ ఇక్కడ పేస్ట్ చేయండి.
– బాణం గుర్తును (⇨) రిమూవ్ చేయండి.. మరో చిహ్నాన్ని (ຸ) వదిలేయండి.
ఇప్పుడు మీ పేరును మార్చేందుకు OK బటన్‌ Select చేయండి.
అంతే.. Whatsappలో మీ Profile దగ్గర పేరు కనిపించదు. మ్యాజిక్ చూశారుగా..

Advertisement

WhatsAppలో మీ పేరును దాచే మరో ట్రిక్..
ఈ రెండు (⠀) సింబల్స్ కాపీ చేయండి..
WhatsApp యాప్ ఓపెన్ చేయండి.
Settings Menuకు వెళ్లండి..
మీ Profile ఓపెన్ చేయండి..
మీ పేరు రిమూవ్ చేయండి..
అక్కడే ఈ (⠀) సింబల్స్ Paste చేయండి..
Save బటన్ Press చేయండి.

మీ వాట్సాప్ ప్రొఫైల్ ఎవరైనా Press చేసి చూసినప్పుడు.. వారికి అక్కడ Empty Place మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ.. యూజర్ ఎవరైనా తెలివిగా మీ వాట్సాప్ ప్రొఫైల్ తెలుసుకోవడానికి మీ కాంటాక్ట్ నెంబర్‌ను వాట్సాప్ గ్రూప్‌కి యాడ్ చేస్తే.. మీ పేరు గ్రూపులో కనిపిస్తుంది. వ్యక్తిగత యూజర్లకు మాత్రం మీ పేరు కనిపించదు.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి.. వర్కౌట్ అవుతుందో లేదో..

Advertisement

Read Also : Music Stairs : మెట్రోలో మెట్లు నుంచి మ్యూజిక్.. భలే ఉందిగా.. ప్రయాణికులకు ఉల్లాసం..!

Advertisement