TDP CM Candidates : టీడీపీలో నయా లీడర్లు.. సీఎం అభ్యర్థులు వీళ్లే..?

Updated on: December 10, 2021

TDP CM Candidates : 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థులుగా ఉన్నది ముగ్గురే. ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు మరొకరు ఆయన అల్లుడు.. నారా చంద్రబాబు నాయడు.. ఇంకొకరు నాదెండ్ల భాస్కరరావు.. టీడీపీ నుంచి సీఎం అభ్యర్థులుగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఇప్పటికీ ఆయనే అఫీషియల్‌గా సీఎం క్యాండిడేట్‌గా ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇటీవల చంద్రబాబు తాను సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం కూడా చేశారు. ఆ మాటలను బట్టి మళ్లీ 2024 ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థని తెలిపారు. అయితే, టీడీపీ నుంచి సీఎం క్యాండిడేట్‌గా కొత్త పేర్లు ప్రస్తుతం వినబడుతున్నాయి.

చంద్రబాబు నాయుడు పాలనను, ఆయన పాలసీ మేకింగ్‌ను గతంలో చూసిన ప్రజలు ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని, కొత్త నాయకుడికి సీఎం అభ్యర్థి అయ్యే చాన్స్ ఇవ్వాలని కొందరు అంటున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ కేడర్‌లోనూ అధినాయకత్వంపై అసంతృప్తి ఉందని తెలుస్తోంది. పార్టీ పుంజుకోవడం లేదని, పార్టీ బలోపేతం చేయాలంటే మరో అభ్యర్థి ఉండాలనే వాదన ఉంది. చంద్రబాబు నాయుడు పాలనను ప్రజలు చూశారు. కనుక ఈ సారి కొత్త టైప్ రూలింగ్ రావాలని అంటున్నారు. అయితే, చంద్రబాబు తన తర్వాత తన తనయుడు లోకేశ్ అనే విధంగా ప్రొజెక్ట్ చేశాడు.

లోకేశ్‌ను హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, లోకేశ్ కన్న చంద్రబాబే నయం అన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనూ ఉందట. ఈ సంగతి అలా ఉంచితే.. చంద్రబాబు తర్వాత సీఎం క్యాండిడేట్‌గా ఆయన బావమరిది, వియ్యంకుడు బాలయ్య అయితే ఎలా ఉంటుందనే చర్చ బయలుదేరింది. ‘అఖండ’ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన నేపథ్యంలో ఆయన రాజకీయంగానూ ఎదుగుతారని ఎన్ఆర్ఐ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ బాలయ్య ఆసక్తి చూపకపోతే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆయన ఆ అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి. ఈ విషయాలపై టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో..

Advertisement

Read Also : Balayaiah Comments : బాలయ్య కామెంట్స్‌తో ప్రకంపనలు.. టీడీపీకి మరో తలనొప్పి..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel