Intinti Gruhalakshmi Oct 18 Today Episode : లాస్యని ఉద్యోగంలో నుంచి పీకేసిన సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న లాస్య..?

Updated on: October 18, 2022

Intinti Gruhalakshmi Oct 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య సామ్రాట్ దగ్గరికి వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ నందు మీద విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినప్పుడు మానేయడం కాదు కనీసం చెప్పాలి అని కూడా తెలియదా అని అరుస్తూ ఉండగా మీరేం భయపడకండి సార్ నేను చెప్పాను కానీ వినలేదు. పనులన్నీ నేను చూసుకుంటాను మీకు భరోసా ఇస్తాను సార్ అని అంటుంది. జనరల్ మేనేజర్ పోస్ట్ నాకు ఇవ్వండి నేను మీ ఆఫీస్ పరువు నిలబెడతాను అని అంటుంది లాస్య.

samrat fires on tulasi in todays intinti grhalakshmi serial episode
samrat fires on tulasi in todays intinti grhalakshmi serial episode

అప్పుడు సామ్రాట్ వెళ్లి మేనేజర్ పోస్టింగ్ ప్రింటింగ్ చేయించుకుని రా అని అనగా లాస్య సంతోషంతో బయటకు వెళ్తూ ఉండగా హలో మేడం కంగారు తగ్గించండి నేను చెప్పింది మీ పేరు మీద కాదు తులసి గారి పేరు మీద అని అంటాడు సామ్రాట్. లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన పేరు మీద ఎందుకు సార్ చదువు రానిది ఇంగ్లీష్ కూడా రాదు. మొన్న 10 కోట్లు నష్టపోయే పరిస్థితికి వచ్చాము కానీ నందు కాపాడాడు అని అనగా వెంటనే సామ్రాట్ ఇప్పుడు ఏం చేశాడు నందు మధ్యలో వదిలిపోయాడు అంటూ లాస్య గాలి పీకేస్తాడు.

తులసి దగ్గరికి వెళ్లి 10 నిమిషాల్లో చెప్పండి అని అంటాడు సామ్రాట్. లాస్య కుళ్ళుకుంటూ కోపంతో తులసి దగ్గరికి వెళుతుంది. అప్పుడు లాస్య జరిగిన విషయం తులసికి చెప్పడంతో తులసి సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు సామ్రాట్ గారు నన్ను ముందు జనరల్ మేనేజ్ చేశారు మల్ల తీసేసారు ఇప్పుడు మళ్లీ ఎందుకు యాడ్ చేశారు అని అంటుంది తులసి.

Advertisement

Intinti Gruhalakshmi అక్టోబర్ 18 ఎపిసోడ్ : నందు, లాస్యని అవమానించిన సామ్రాట్..

ఇక ముందు జరిగిన తప్పు నాదే అందులో మీ తప్పులేదు అని మీద ఒట్టేసి చెబుతున్నాను ఇకపై ఎలాంటి తప్పులు జరగవు అని అనడంతో తులసి సరే అని అంటుంది. ఆ తర్వాత తులసి,సామ్రాట్, లాస్య ముగ్గురు మీటింగ్ హాల్లో కూర్చుని ఉండగా సామ్రాట్ తులసి మాట్లాడుతూ ఉండడంతో మధ్యలో లాస్య కలుగజేసుకొని జవాబు ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీటింగ్ మొదలవగా తులసి ని సామ్రాట్ మొదలు పెట్టమని వెంటనే లాస్య లేసి మాట్లాడుతూ ఉండగా నువ్వా మేనేజర్ తులసినా అని నందు, లాస్యని అవమానిస్తారు.

అప్పుడు నందు చెప్పిన మాటలు తలుచుకున్న లాస్య కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బయటకు వెళ్లి నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది. అప్పుడు కంపెనీలో వాళ్ళు సాంబార్ గురించి గొప్పగా చెబుతూ ఉండగా లాస్య మాత్రం వారిద్దరి మధ్య అంతకుమించి సంబంధం ఉంది అంటూ తప్పుగా వాగుతూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్ అక్కడికి వచ్చి ఎందుకు ఆపేసావు లాస్య కంటిన్యూ చేయి లాస్య మీద కోపంతో విరుచుకుపడతాడు.

అది కాదు సార్ అని లాస్య మాట్లాడుతూ ఉండగా ఇంకేమి మాట్లాడకు. అత్తయ్య అంటే పాతకాలం మనిషి ఆవిడకు ఏమీ తెలియదు అనుకుందాం కానీ నువ్వు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నావు అంటూ లాస్య మీద విరుచుకుపడుతూ ఇప్పటికిప్పుడే జాబ్ లోంచి తీసేస్తున్నాను వెళ్ళిపో అంటూ అవమానిస్తాడు. పక్కనే ఉన్న తులసి అంత చూస్తూ ఉంటుంది.

Advertisement

Read Also : Intinti Gruhalakshmi serial Oct 17 Today Episode : తులసి కోసం సర్ప్రైజ్ ను ప్లాన్ చేసిన పరంధామయ్య.. నందుని కన్విన్స్ చేస్తున్న లాస్య ..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel