Devatha Serial End : దేవత సీరియల్ క్లైమాక్స్ అదిరింది.. మాధవను చంపేసిన సత్య.. రుక్మిణి అరెస్టు చేసిన పోలీసులు..?

Devatha Serial Nov 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవి ఆదిత్య ను నాన్న అని పిలవడంతో ఆదిత్య సంతోష పడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో రుక్మిణి గుళ్లో దేవుడి ముందు నిలబడి ఆరోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఒక దారి చూపించావు ఇప్పుడు మళ్లీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాను నా బిడ్డను నా పెనిమిటికీ అప్పగించి నేను ఒక దారి చూసుకుంటాను నాకు ఏదైనా ఒక మంచి దారి చూపించు దేవుడా అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది రుక్మిణి. ఇంతలోనే మాధవ రుక్మిణి వెతుక్కుంటూ గుడికి వస్తాడు.

Devatha Serial Nov 12 Today Episode
Devatha Serial Nov 12 Today Episode

అక్కడ రుక్మిణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మాధవ. అప్పుడు మాధవ తాళిబొట్టు తీసుకొని రుక్మిణి మెడలో కట్టబోతుండగా అది చూసి రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏది సారు నువ్వు చేస్తున్న పని ఇదే మంచిగా లేదు అని అనగా మాధవ మళ్ళీ బలవంతంగా తాళి కట్టడానికి వస్తాడు. అప్పుడు రుక్మిణి మాధవ నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీస్తుంది.

Advertisement

అప్పుడు మాధవ కూడా బయటకు పరిగెత్తుతూ వెళ్లి రాధను అడ్డుకుంటాడు. అప్పుడు రాధా నా మెడలో పెనిమిటి కట్టిన దాలి ఉంది. దీన్ని చూసి అయినా విడిచిపెట్టి సారు అనగా అది తీసేస్తే వాడు నీ పెనిమిటి ఎలా అవుతాడు అని మాధవ తాళిబొట్టు కట్టబోతూ ఉండగా సత్య వచ్చి మాధవ తల పగలగొడుతుంది. అది చూసి రుక్మిణి షాక్ అవుతుంది. అప్పుడు సత్య నన్ను క్షమించు అక్క నువ్వు నాకోసం చేసిన త్యాగాలు అన్ని మరిచిపోయి నిన్ను నానా మాటలు అని బాధ పెట్టాను అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది సత్య.

Devatha Serial Nov 12 Today Episode : దేవత సీరియల్‌కు శుభం కార్డు..  

అప్పుడు సత్య ఏడుస్తూ రుక్మిణి కాళ్లు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలోనే దేవి చిన్మయి భాగ్యమ్మ ముగ్గురు అక్కడికి వస్తారు. అప్పుడు కావాలనే మాధవని తాను చంపినట్టుగా రుక్మిణి చేతిలోకి ఆ దీపాన్ని తీసుకుంటుంది. అప్పుడు చిన్మయి అక్కడికి వచ్చి నాన్న లే నాన్న అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి దేవుడమ్మ కుటుంబం వస్తారు.

Devatha Serial Nov 12 Today Episode
Devatha Serial Nov 12 Today Episode

అప్పుడు మాధవని చూసి వాళ్ళు షాక్ అవడంతో నేనే నా బతుకును ఆగం చేస్తుంటే చంపేశాను అని తనపై నిందను వేసుకుంటుంది రుక్మిణి. ఇప్పుడు భాగ్యమ్మ రుక్మిణి చేసిన పనికి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రుక్మిణి చిన్మయి దేవి బాధ్యతలను సత్యకి అప్పగిస్తుంది. అప్పుడు దేవుడమ్మ దగ్గరికి వెళ్లి బిడ్డ లెక్క చూసుకునే నిన్ను కాదని అగుపటికి వచ్చేసాను.

Advertisement

నేను నీ నుంచి తప్పించుకోవడానికి నేను వేరే వాళ్లకు కోడలిని అని చెప్పాను కానీ నేను సచ్చే వరకు నీ కోడల్ని అత్తమ్మ అని ఎమోషనల్ గా మాట్లాడుతూ దేవుడమ్మ కాళ్ళు పట్టుకుంటుంది. ఇప్పుడు ఆదిత్య దగ్గరికి వెళ్లి నీకు మాట ఇచ్చినట్టుగానే దేవమ్మన నీకు అప్పచెబుతున్నాను అని ఎమోషనల్ గా మాట్లాడడంతో ఆదిత్య కూడా ఎమోషనల్ అవుతాడు. ఇంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు పోలీసులు రుక్మిణి అరెస్టు చేసి తీసుకెళ్లడం చూసి అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు.

Read Also : Devatha: దేవి తన మనవరాలు అని తెలుసుకున్న దేవుడమ్మ..ఆదిత్యను నాన్న అని పిలిచిన దేవి..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel