Guppedantha Manasu July Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కృషి బయటకు వెళుతూ అక్కడి ప్రోగ్రాం అంతా జగతి మహేందర్ ను చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి,వసు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వసు, రిషి సార్ ఎక్కడికి వెళ్ళాడు వస్తాడా రాడా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జగతి ఈ అభినందన సభ ఏర్పాటు చేసిందే మీ రిసీ సారు అలాంటిది ఎందుకు రాకుండా ఉంటారు అంటూ ధైర్యం చెబుతుంది.

కానీ వసుధార మాత్రం జగతి మాటలు పట్టించుకోకుండా రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు జగతి నీపై నీకు ఒక క్లారిటీ రావాలి అని అనగా ఈ మధ్యనే నాకు ఒక క్లారిటీ వచ్చింది మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి ఎందుకు నేను వసుధారకు ఎదురు పడలేకపోతున్నాను నేను తప్పు చేయలేదు కదా నేను మీటింగ్ లో లేకపోతే ఎలా అని బాధపడుతూ అక్కడి నుంచి మళ్లీ బయలుదేరుతాడు.
మరొకవైపు అభినందన సభ దగ్గర అందరూ ఏర్పాట్లు చూసుకుంటూ ఉండగా వసుధార మాత్రం రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరొకవైపు రిషి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసుధార నా గెలుపుకు కారణమే మీరు అలాంటిది మీరు లేకపోతే ఎలా అంటూ మెసేజ్ చేస్తుంది. అప్పుడు గౌతమ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు రమ్మని చెప్పగా రిషీ కోపంతో ఫోన్ కట్ చేస్తాడు.
ఆ తర్వాత దేవయాని అక్కడికి వచ్చి మహేంద్ర జగతి దంపతుల గురించి కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు జగతికి దేవయాని సాక్షిల మీద అనుమానం వస్తుంది. వీరిద్దరూ కలిసి ఏదో ఒక ప్లాన్ పన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మినిస్టర్ రావడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రోగ్రాం మొదలవుతుంది.
వసు మాత్రం రుషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు జగతి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని సాక్షి వెళ్లి వసుధారకు సంబంధించిన ఒక ఏవి ని చూపించడంతో జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వీడియోని పెద్ద తెరపై చూపిస్తాము అక్కడ చూడండి అని సాక్షి అనడంతో సాక్షిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది జగతి.
ఇంతలోనే అక్కడికి రిషి రావడంతో జగతి ఇప్పుడే నువ్వు రావాలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వసుధారకి సంబంధించిన ఏవి నీ ప్లే చేయడంతో ఆ వీడియోని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వసుధారకు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉంటుంది. కానీ అదంతా వసుధార ప్లాన్ అనుకున్నా రిషి ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Guppedantha Manasu january 26 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. ఎమోషనల్ అవుతున్న వసుధార.?
- Guppedantha Manasu Nov 11 Today Episode : వసుధారకు రింగు తొడిగిన రిషి.. ప్రేమతో హగ్ చేసుకున్న వసుధార..?
- Guppedantha Manasu Dec 9 Today Episode : బాధతో కుమిలిపోతున్న వసుధార.. వసుని తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన జగతి?















