వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu: సాక్షి బుద్ధి చెప్పిన జగతి.. రిషిని కౌగిలించుకొని థాంక్స్ చెప్పిన వసు.?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు బొమ్మ చిరిగి పోయినందుకు బాధపడుతూ ఎలా అయినా ఆ బొమ్మ గీసిన వ్యక్తిని వెతికి పట్టుకుంటాను అని అంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసు రెస్టారెంట్ లో ఉండగా అక్కడికి ఒక చిన్న పిల్లవాడి తో రిషి బొమ్మను పంపగా అది ... Read more

By Ramesh Babu

Published on: May 14, 2022 9:21 AM

Updated on: May 14, 2022 9:21 AM

---Advertisement---

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు బొమ్మ చిరిగి పోయినందుకు బాధపడుతూ ఎలా అయినా ఆ బొమ్మ గీసిన వ్యక్తిని వెతికి పట్టుకుంటాను అని అంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసు రెస్టారెంట్ లో ఉండగా అక్కడికి ఒక చిన్న పిల్లవాడి తో రిషి బొమ్మను పంపగా అది చూసిన వసు ఆనందంతో మురిసి పోతూ ఉంటుంది. ఆ బొమ్మను తీసుకు వచ్చిన పిల్లాడు అక్కడే ఉన్నాడని చెప్పడంతో అతను ఎవరో అడగాలి అని అక్కడికి వెళుతుంది వసు.

అప్పుడు రిషి తన గురించి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని భయపడుతూ ఉంటాడు. ఎలాగో అలాగా వసు నుంచి తప్పించుకుంటాడు. మరొకవైపు జగతి గదిలో ఒంటరిగా ఉండగా అక్కడికి సాక్షి వెళ్తుంది. దారిలో వెళ్తున్నానని అందుకే రిషిని కలుద్దామని వచ్చాను అని అంటూ,తనను ఎవరు అర్థం చేసుకోరు అని.. కానీ నేను అందర్నీ అర్థం చేసుకుంటాను అని అంటుంది.

అప్పుడు జగతి.. నిన్ను అర్థం చేసుకోవడం లేదు అంటే అది నీ లోపం అని అంటుంది. అంతేకాకుండా రిషి కోసం ఎప్పుడుపడితే అప్పుడు ఇలా రావడం కరెక్ట్ కాదు మరి ఉదయం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఏం చేయాలి అని అడుగగా అప్పుడు జగతి నేరుగా రావడం మానేశాయ్ అని అంటుంది.

ఆ తర్వాత రిషి, వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పూలు అమ్ముకునే ఆవిడ అక్కడికి రావడంతో వసు పూలు తీసుకోవడానికి రిషి నిరాకరిస్తాడు.

ఆ తర్వాత వసు ఆ బొమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రెస్టారెంట్ లో రిషి ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని ఆ బొమ్మ రిషి నే గీసాడేమో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి వసు కి ఎదురుకావడంతో వసు,రిషిని పట్టించుకోకుండా ఆ బొమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

అప్పుడు బొమ్మ గీసిన వాళ్ళు ఎదురు పడితే ఏం చేస్తావు అనటంతో వెంటనే కౌగిలించుకొని థాంక్స్ చెబుతాను అని రిషిని కౌగిలించుకొని చూపిస్తుంది. ఒకవేళ నేనే గీసినట్లయితే ఏం చేస్తావు అనటంతో.. వెటకారంగా నవ్వుతూ మీరా అన్నట్లు మాట్లాడుతుంది వసు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel