Guppedantha Manasu july 18 Today Episode : సాక్షికి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన వసు.. రిషి తెచ్చిన డ్రెస్ వేసుకున్న వసు..?

Updated on: July 18, 2022

Guppedantha Manasu july 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతికి తన మాటలతో సాక్షికి గట్టిగా బుద్ధి చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జగతి, సాక్షికి స్వీట్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చేయడం వెనుక కారణం ఏంటో నాకు తెలుసు, దాని వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలుసు అని అనగా వెంటనే సాక్షి ఏం మాట్లాడుతున్నారు ఆంటీ అంటూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడడంతో వెంటనే జగతి సాక్షికి గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అయినా కూడా సాక్షి అలాగే మాట్లాడటంతో ఇంతలో వసుధార అక్కడికి వచ్చి మేడం ముందు మాట్లాడితే బాగుండదు.

 Guppedantha Manasu july 18 Today Episode :Vasudhara gets puzzled when Rishi gifts her dresses in todays guppedantha manasu serial episode
Guppedantha Manasu july 18 Today Episode :Vasudhara gets puzzled when Rishi gifts her dresses in todays guppedantha manasu serial episode

నువ్వు చేసిన పనులు అన్నీ కూడా మేడం ముందు చెబితే ఎలా ఉంటుందో ఆలోచించుకో, ఇప్పటివరకు వసు చూసావు. ఇక ముందు ముందు కొత్త వసుధారని చూస్తావు అంటూ సాక్షికి స్వీటుగా వార్నింగ్ ఇస్తుంది వసు. అప్పుడు కోపంతో సాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Guppedantha Manasu july 18 Today Episode : రిషి తెచ్చిన డ్రెస్ వేసుకున్న వసు..

Advertisement

మరొకవైపు దేవయాని టెన్షన్ పడుతూ ఇంతలో అక్కడికి వెళ్లి నవ్వుతూ వెటకారంగా మాట్లాడడంతో దేవియానికి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సాక్షి దేవయానికి జరిగింది మొత్తం వివరించడంతో దేవయాని సాక్షికి మరిన్ని మాటలు నూరిపోసి ధైర్యం చెబుతుంది. మళ్లీ భరణి దేవయానికి కాఫీ తీసుకొని వచ్చి వెటకారంగా మాట్లాడడంతో ధరణికి ఏమైంది అని ఆలోచనలో పడుతుంది దేవయాని.

మరొకవైపు రిషి,వసు కోసం డ్రెస్సులు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత వసుధార రమ్మని చెప్పి అక్కడున్న వ్యక్తికి చెప్పి పంపిస్తాడు రిషి. మధ్యలో సాక్షి అతనికి ఎదురుపడి కృషి ఒక్కడే ఉన్నాడా అని అడగగా సార్ వసు మేడంని పిలుచుకొని రమ్మన్నాడు అని చెప్పడంతో కోపంతో రగిలిపోతుంది సాక్షి. మరొకవైపు వసుధార క్లాసులో తన సార్ తో మాట్లాడుకుంటూ బొమ్మలు గీస్తూ ఉంటుంది.

ఇంతలో రిషి పిలుస్తున్నాడు అని ఆ వ్యక్తి చెప్పడంతో ఆ తర్వాత వసుధార, రిషి దగ్గరికి వెళ్తుంది. రిషి టేబుల్ పైన డ్రెస్సులు చూసి ఎవరికీ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు రిషి ఎలా ఉన్నాయి అని అడిగి అవి నీకోసమే అని చెబుతాడు రిషి. అప్పుడు వసుధార ఆ బట్టలు తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఎలా అయినా డ్రస్సులు తీసుకునే విధంగా చేయాలి అనుకుంటాడు రిషి.

Advertisement

ఇంతలోనేసాక్షి అక్కడికి వస్తుంది. అక్కడ బట్టలు చూసి ఏంటి ఇవి అని అడగగా రిషి వసు కోసం నేనే బట్టలు తీసుకువచ్చాను అని అనడంతో సాక్షి కోపంతో రగిలిపోతుంది. అప్పుడు సాక్షి ఎలా అయినా వసుధారని మరింత బాధ పెట్టాలి అని మాట్లాడగా వెంటనే వసుధార నేను సాక్షి మేడంతో మాట్లాడుతాను సార్ అని చెప్పి తనస్టైల్ లో కౌంటర్ ఇస్తుంది.

అప్పుడు సాక్షి ఈ బట్టలు నీకు నచ్చాయా అని అనగా అప్పుడు వెంటనే వసుధార నాకోసం షాపింగ్ మాల్ కు వెళ్లి టైం స్పెండ్ చేసి తీసుకుని వచ్చినప్పుడు నేను ఎందుకు కాదంటాను అని అనగా సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వసుధార మాటలు అర్థం కాక రిషి ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత వసు రిషికి థాంక్స్ చెప్పి ఆ బట్టలు తీసుకొని వెళుతుంది. రేపటి ఎపిసోడ్ లో వసు ఆ బట్టలను మహేంద్ర దంపతులకు చూపిస్తుంది.

మీ అబ్బాయి నాకెందుకు డ్రెస్సులు ఇచ్చాడు అని అనగా వెంటనే జగతి దాని వెనుక ఏదో లింకు ఉండే ఉంటుంది అని అనడంతో వసుధార సాక్షి అన్న మాటలను ఆలోచిస్తుంది. ఆ తర్వాత రిషి మీటింగ్ హాల్లో వసు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసు రిసీ తెచ్చిన డ్రెస్ ని వేసుకొని వస్తుంది. అది చూసి సాక్షి రగిలిపోతూ ఉండగా మహేంద్ర దంపతులు రిషి మాత్రం ఆనందపడుతూ ఉంటారు.

Advertisement

Read Also :  Guppedantha Manasu july 16 Today Episode : గౌతమ్, రిషిల ముందు వసుని అవమానించిన సాక్షి.. దేవయానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన జగతి..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel