AP PRC Issue : ఏపీలో ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు… నోటిఫికేషన్ జారీ !

AP PRC Issue : ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఓవైపు ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. ఆ దిశగా తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, డీడీఓలకు సర్క్యూలర్ జారీ చేసింది ఆర్థికశాఖ. ఓవైపు పీఆర్సీ సాధన కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుపుతుండగానే.. మరోవైపు ఆర్థిక శాఖ సర్క్యూలర్ జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మేరకు ఏపీ సచివాలయం, హెచ్‌వోడీలు, ట్రెజరీలు, అకౌంట్స్‌ అండ్‌ పే, డీడీవోలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. 2022 జనవరి శాలరీని ఉద్యోగులకు సంబంధిత డీడీవోల ద్వారా రివైజ్డ్ పే స్కేల్‌ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి రివైజిడ్‌ కంసాలిడేటెడ్‌ పెన్షన్‌, బెనిఫిట్లను డీడీవోల ద్వారా చెల్లించాలని సూచించింది. కాగా, మరోవైపు ఏపీలో సమ్మె సైరన్ మోగింది. పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో తెలిపాయి.

Advertisement

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని సమ్మె నోటీసులో డిమాండ్ చేశాయి ఉద్యోగ సంఘాలు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. అటు… పీఆర్సీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఉద్యోగ సంఘాలు బెట్టు దిగడం లేదు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని చెప్పడం సమంజసం కాదని ప్రభుత్వం అంటుంటే.. జీవోలను వెనక్కి తీసుకుంటేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Read Also : Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్… ఏంటంటే ?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel