Vh car damage: వీహెచ్ కారుపై దాడి.. వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ అంబర్ పేటలోని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన వికాస్ సింగ్ గా గుర్తించారు. అతడు నగరంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నాడు. వీహెచ్ ఇంటి ముందు నిలిపిన కారు అద్దాలను అర్ధరాత్రి ధ్వంసం చేశాడు.

సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు.. కార్ల అద్దాలను ధ్వంసం చేసిన వికాస్ సింగ్ ను అరెస్టు చేశారు. వీహెచ్ కారును ఎందుకు ధ్వంసం చేశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. అంతకుముందు వి. హనుమంతరావు ఇళ్లు, కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారనే వార్తలు వచ్చాయి.

Advertisement

అర్ధరాత్రి సమయంలో ఆమ్లెట్ వేసుకుని పాత్ర లాంటి దానితో వచ్చిన నిందితుడు… కాసేపు కారు వద్ద తచ్చాడాడు. అనంతరం కారు వద్ద కాసేపు వేచి చూసి ఎవరూ లేని సమయంలో ఆ పాత్రతో కారుపై దాడి చేశాడు. వికాస్ సింగ్ దాడిలో కారు అద్దాలు పగలడంతో పాటు స్వల్పంగా ధ్వంసం అయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు వికాస్ సింగ్ నుండి ఆ పాత్రను కూడా స్వాధీనం చేసుకున్నాడు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel