Pawan Kalyan : బద్వేలు ఉపఎన్నికపై పవన్ మౌనం.. బీజేపీలో టెన్షన్ టెన్షన్

Updated on: August 4, 2025

Pawan Kalyan : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం బద్వేలు ఉపఎన్నికవైపే తిరుగుతున్నాయి. అయితే, బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అందరినీ తొలస్తున్న ప్రశ్న. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఖాళీ అయిన స్థానం వైసీపీది కావడంతో టీడీపీ పోటీ చేయనని ముందే ప్రకటించింది.

జనసేన అధినేత కూడా పోటీ చేయనని చెప్పారు. కానీ, ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీకి పవన్ మద్దతు ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టంచేశారు. అంతేకాకుండా బీజేపీ తరపున జనసేనాని ప్రచారం చేస్తారని కాషాయ పార్టీ శ్రేణులు నమ్మకంతో ఉన్నారు.

తిరుపతిలో కలిసిరాకపోవడమే కారణమా..
గత తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక తర్వాత బీజేపీ, జనసేన పార్టీ కలిసి పనిచేయలేదు. ఆనాడు తిరుపతి ఉపఎన్నిక సీటు ఆశించిన పవన్ బీజేపీ పెద్దల జోక్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థికి తరఫున ప్రచారం చేశారు.

Advertisement

అయినా బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. బీజేపీతో పొత్తు మనకు కలిసి రావడం లేదని కార్యకర్తల సూచన మేరకు పవన్ ఒంటరిగా బరిలోకి దిగేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ఒంటరిగానే ప్రశ్నిస్తున్నాడు.

బద్వేల్ ఉపఎన్నిక విషయంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాము బైపోల్ లో పోటీ చేయమని జనసేన ప్రకటించినా ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ మాత్రం కాషాయ పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.

కానీ, పవన్ ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఆయన ఎక్కడా చెప్పలేదు. బీజేపీ నాయకులు మాత్రం బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో తమ పార్టీ తరఫున పవన్ ప్రచారం చేస్తారని అదే పనిగా చెప్పుకుంటున్నారు. దీనిపై జనసేనాని ఇంతవరకు ఏ డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.

Advertisement

మరో మూడు రోజుల్లో ఉపఎన్నిక ప్రచారం గడువు ముగుస్తున్న సమయంలో నేటికి పవన్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. దీంతో పవన్ ఇక ప్రచారానికి రాకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ జనసేనాని బద్వేల్ ప్రచారానికి హాజరుకానట్టయితే బీజేపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

జనసైనికులు మాత్రం తాము ముందే పోటీ చేయమని చెప్పాము. ఇప్పుడు మీ తరఫున ప్రచారం చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఉపఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన మధ్య సఖ్యత అలానే ఉంటుందా.. చీలిక వస్తుందా అనేది వేచిచూడాల్సిందే.
Ys Jagan : జగన్ తీరు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ప్రతిపక్షాలకు విమర్శించే చాన్స్ దొరికినట్టేనా..?!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel