Karthika Deepam serial Oct 19 Today Episode : దగ్గరవుతున్న దీప,కార్తీక్.. కోపంతో రగిలిపోతున్న మోనిత..?

Updated on: October 19, 2022

Karthika Deepam serial Oct 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్ వారణాసి దగ్గరికి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ వారణాసి దగ్గరికి వెళ్లి వారణాసి పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటాడు. మమ్మల్ని కలపడానికి వచ్చి నువ్వు ఇంత ఇబ్బందుల్లో పడ్డావు వారణాసి. నువ్వు కోరుకున్న తర్వాత నిన్ను మా ఇంట్లో మనిషిలాగ చూసుకుంటాము అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలోనే డాక్టర్ అక్కడికి రావడంతో డాక్టర్ వారణాసికి ఎలా ఉంది అని అడగగా అప్పుడు డాక్టర్ కోమాలో ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ కి బాగానే రెస్పాండ్ అవుతున్నాడు అని అంటాడు.

Karthika Deepam serial Oct 19 Today Episode
Karthika Deepam serial Oct 19 Today Episode

అప్పుడు డాక్టర్ సార్ మీ ప్రొఫైల్ ఇన్ చూసాను మీరు హైదరాబాదును వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఏమైనా హాస్పిటల్ లో పనిచేస్తున్నారా అని అడగగా లేదు డాక్టర్ అని అంటాడు కార్తీక్. ఇంకా మేము కొద్ది రోజులు ఇక్కడే ఉంటాము కావాలి అంటే ఏదైనా ఆపరేషన్ జరిగితే చెప్పండి వచ్చి సహాయం చేస్తాను అని అంటాడు కార్తీక్. అప్పుడు ఆ డాక్టర్ సరే సార్ తప్పకుండా అని అంటాడు. మరొకవైపు దీప, హేమచంద్రతో మాట్లాడుతూ అన్నయ్య డాక్టర్ బాబుకి ఎవరు ఫోన్ చేస్తే వస్తాను అని వెళ్లారు.

ఇక్కడ ఆయనకు తెలిసిన వారు ఎవరు ఉన్నారు అని మాట్లాడుతూ ఉండగా ఏం కాదులే దీప ఆయనకు ఈమధ్య ఈమధ్య ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి నీకు మంచి రోజులు వస్తున్నాయి అనడంతో ఇంతలోనే దుర్గ అక్కడికి వచ్చి అవును దీపమ్మ సార్ చెప్పింది నిజమే అని అంటాడు. మరొకవైపు కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వస్తాడు.

Advertisement

Karthika Deepam అక్టోబర్ 18 ఎపిసోడ్ :మోనిత షాక్..శౌర్యని వెతుకుతున్నశివ..

ఎక్కడికి వెళ్లావు కార్తీక్ అని అనగా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లాను అని అంటాడు. నాకు తెలియకుండా నీకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అని అడగగా సుబ్బారావు అప్పారావు లేకపోతే ఆనంద్ రావు సౌందర్యను అని అంటాడు. అప్పుడు మోనిత ఆ పేర్లు విని నిజంగానే అన్నాడా తెలియక అన్నాడా అని షాక్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో కార్తిక్ నేను వెళ్లి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళగా ఆ కార్తీక్ ఆ టాబ్లెట్లను చూసి పక్కకు పాడేస్తాడు.

గుర్తుపట్టిన కార్తిక్ మోనిత ను తిట్టుకుంటూ ఉంటాడు. మరొకవైపు దీప, హేమచంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు దీప డాక్టర్ బాబు గురించి ఆలోచించుకుంటూ ఇల్లంతా క్లీన్ గా పెట్టలేదు అన్నయ్య అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను వంటలక్క అని ఇంట్లో బూజు దులుపుతాడు. ఆ తర్వాత దీప వంట చేస్తాను అని అనగా వద్దు అక్క నేనే వంట చేస్తాను అని చెప్పి వంట చేస్తాడు కార్తీక్.

ఆ తర్వాత కార్తీక్ బయటకు వచ్చి శివ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. పాప గురించి వెతకమని చెబుతాడు. మరొకవైపు శివ ఇంటికి వస్తూ ఉండగా మౌనిక ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నావు ఏదో చిన్న పని మేడం అంటావు వెళ్తున్నా వస్తున్నావు చాలా రోజుల నుంచి నీ ప్రవర్తన మారింది శివ అని అనగా శివ చెప్పడానికి సంకోచిస్తూ ఉండగా అయితే జాబ్ లో నుంచి నిన్ను తీసేసాను అనడంతో అసలు విషయం చెబుతాడు శివ. దాంతో మోనితో ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

తర్వాత శివ తో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే దుర్గ అక్కడికి వస్తాడు. నువ్వు వంటలక్కఇంటికి మాత్రం వెళ్లద్దు వెళ్తే నీకు ఒక అక్కడ కార్తీక్ సార్ దీప ని ఏకాంతంగా వదిలి ఇక్కడికి వచ్చాను అనడంతో కంగారుపడిన మోనిత అక్కడికి వెళుతుంది. అక్కడ కార్తీక్ వంట చేసే కూర్చో వంటలక్క నేను వడ్డిస్తాను అనడంతో గోరుముద్దలు పెట్టి తినిపించు అని అక్కడికి వస్తుంది మోనిత.

ఇప్పుడు మౌనిత దీపం మీద సీరియస్ అవుతూ నా మొగుడుతో నువ్వేం చేస్తున్నావే అనగా వెంటనే కార్తీక్ ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలు బాగుంటే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను ఇంట్లోనే ఉండే వాడిని కదా అని అంటాడు. ఇప్పుడు నేనేం చేశాను కార్తీక్ అనే మోనిత అనడంతో డాక్టర్ బాబు జరిగిన విషయమే కదా చెబుతున్నారు నువ్వే దుర్గతో ఏకాంతంగా గడపాలి అని శివతో డాక్టర్ రెండు గంటలు బయటికి పంపించమన్నావు అనడంతో మోనిత షాక్ అవుతుంది.

Read Also : Karthika Deepam serial Oct 18 Today Episode : కార్తీక్ మాటలకు షాక్ అయిన మోనిత..వారణాసి పరిస్థితి చూసి బాధపడుతున్న శౌర్య..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel