Karthika Deepam serial Oct 18 Today Episode : కార్తీక్ మాటలకు షాక్ అయిన మోనిత..వారణాసి పరిస్థితి చూసి బాధపడుతున్న శౌర్య..?

Updated on: October 18, 2022

Karthika Deepam serial Oct 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప నిద్ర లేచి చూసేసరికి బయట కార్తీక్ ఉండడంతో ఆశ్చర్య పోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీపా కార్తీక్ ను చూసి మీరేంటి డాక్టర్ బాబు ఎక్కడున్నారు ఎంతసేపు అయింది వచ్చి అని అడగగా ఇప్పుడే వచ్చాను వంటలక్క అని అంటాడు. సరే లోపలికి రండి డాక్టర్ బాబు అని అనగా పర్లేదు వంటలక్క నువ్వు నీ పని చేసుకో అని చెబుతాడు. అప్పుడు దీప పని చేసుకుంటూ ఉండగా అప్పుడు కార్తీక్ తన పిల్లల గురించి ఈ పని అడగగా ఇప్పుడు దీప వాళ్ళ నానమ్మ తాతయ్యతో కలిసి అమెరికాకు వెళ్లారు అని చెబుతుంది.

sourya gets emotional about Varanasi's health condition in todays karthika deepam serial episode
sourya gets emotional about Varanasi’s health condition in todays karthika deepam serial episode

ఇప్పుడు కార్తీక్ సౌర్య అమెరికాకు వెళ్లలేదు దీప మన కోసం ఇక్కడే వెతుకుతుంది ఈ విషయం నీకు కూడా తెలియదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా దీప చూసి ఏం జరిగింది డాక్టర్ బాబు అని అడగగా ఏమీ లేదు దీప తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకొని వస్తావా అని అడగడంతో సరే అని కాఫీ తీసుకోవడం రావడానికి వెళుతుంది. వైపు మోనిత కార్తీక్ కనిపించకపోయేసరికి ఆ వంటలక్క దగ్గర ఉంటాడు అని దీప దగ్గరికి వెళ్తుంది.

అక్కడ కార్తీక్ దీప ఎదురు నవ్వుకుంటూ కాఫీ తాగుతూ ఉండగా అది చూసి మోనిత కోపంతో రగిలిపోతూ అక్కడికి వెళుతుంది. అప్పుడు మోనిత రాత్రంతా నా మొగుడిని నీతో పాటు అని అంటుండగానే దీప, మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది. పక్కనే ఉన్న కార్తిక్ లోపల నవ్వుకుంటూ బయటికి మాత్రం ఏమీ తెలియనట్టుగా చూస్తూ ఉంటాడు.

Advertisement

Karthika Deepam అక్టోబర్ 18 ఎపిసోడ్ : మోనిత చెంప చెల్లుమనిపించిన దీప..

ఆ తర్వాత ఏంటి కార్తీక్ నువ్వు అలాగే చూస్తూ వున్నావ్ నీ భార్యను కొడుతూ ఉంటే అలాగే ఉంటావా అని అడగడంతో ఇప్పుడు కార్తీక్ దీపకి సపోర్ట్ గా మాట్లాడడంతో మోనిత కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మోనిత ఇంటికి వెళ్లి నన్నే కొడతావా అని చెంప మీద చేయి వేసుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏమి తెలియనట్టుగా అడగడంతో మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

ఇంతలోనే దుర్గ అక్కడికి వచ్చి రవ్వ దోశలు తెచ్చాను అని అంటాడు. కార్తీక్ సార్ వచ్చాడా ఒక మాట కూడా చెప్పలేదు నువ్వు అంటూ మోనిత ను అడ్డంగా ఇరికిస్తాడు. కావాలని తెచ్చుకున్నారు కదా మీరిద్దరూ కలిసి తినండి కావాలంటే నేను వంటలక్క దగ్గర తింటాను అని అంటుండగా ఇంతలో దీప కార్తీక్ కోసం పులిహోర తీసుకొని వస్తుంది. అప్పుడు దీపలు లోపలికి వెళ్లి కార్తీక్ వడ్డిస్తూ ఉండగా బయట దుర్గతో పోట్లాడుతూ ఉంటుంది.

ఆ తర్వాత దీప బాబు నీ ఎత్తుకోగా ఇంతలో అక్కడ పనిచేసే ఆమె రావడంతో మీ మేడం బాబుని చూసుకోలేనంత బిజీగా ఉందా అంటూ పై సీరియస్ అవుతాడు కార్తీక్. మరొకవైపు శౌర్య ఇంద్రుడు మాట్లాడుకుంటూఉంటారు. అప్పుడు వారణాసిని ఎవరో కొట్టారు సౌర్యమ్మ అని చెప్పడంతో శౌర్య ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు హాస్పిటల్ కి వెళ్లిన కార్తీక్ వారణాసి పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. నా భార్యాబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడావు నువ్వు కోరుకున్న తర్వాత నిన్ను నా ఇంట్లో మనిషిగా చూసుకుంటాను వారణాసి అని అనుకుంటూ ఉంటాడు.

Advertisement

Read Also : Karthika Deepam serial Oct 17 Today Episode : దుర్గ కాళ్లు పట్టుకొని బ్రతిమలాడిన మోనిత..సంతోషంలో దీప..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel