Child escapes: పాము కాటెయ్యకుండా క్షణాల్లో బిడ్డను కాపాడిన తల్లి!

Updated on: August 14, 2022

Child escapes: పిల్లలను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యల నుండి అయినా వారి బిడ్డలను కాపాడుకుంటారు. అనుకోని ప్రమాదం వస్తే చాలా త్వరగా స్పందించి వారి బిడ్డను కాపాడతారు. ఇలా చిన్నారులను ప్రమాదాల నుండి తల్లిదండ్రులు కాపాడే సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూ ఉంటాయి.

అలాంటి వీడియోలకు కోట్లాది వ్యూస్, కామెంట్లు, షేర్లు వస్తాయి. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ తల్లి చూపించిన సమయ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో స్పందించి బిడ్డను కాపాడిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి.

Advertisement

అది కర్ణాటక మండ్య ప్రాంతం. ఓ బాలుడు పాఠశాలకు వెళ్లేందుకు ఇంట్లో నుండి బయలు దేరాడు. అదే సమయంలో ఇంటి మెట్ల సమీపం నుండి ఓ పాము వెళ్తుంది. దానిని ఆ కుర్రాడు గమనించలేదు. సర్పంపై అడుగు వేయబోయాడు. ఆ బాలుడి కాళు అడ్డం రావడంతో ఆ పాము కాస్త పడగ విప్పి కాటేయబోయింది.

అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి అది గమనించి క్షణాల్లో స్పందించింది. పడగ విప్పి కాటేయడానికి సిద్ధంగా ఉన్న ఆ పాము నుండి ఆ బాలుడి చేయి పట్టుకుని పక్కకు లాగింది.తర్వాత ఆ పాము అక్కడి నుండి దాని దారిలో అది వెళ్లి పోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Read Also : Viral video: బిడ్డ జోలికి వస్తే తల్లి ఊరుకుంటుందా.. తొక్కి పట్టి నార తీస్తుంది!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel