Viral video : ఆ అబ్బాయికి 23 ఏళ్ల వయసు. ఎలా పడితే అలా స్ర్పింగులా వంగి పోగలడు. శరీరాన్ని ఎటు పడితే అటు రబ్బరులా సాగదీయగలడు. ఒంట్లో ఏమాత్రం ఎముకలు లేనట్లుగా ప్రతీ అవయవాన్ని మెలి తిప్పగల సాహసి. ఒక్క మాటలో చెప్పాలంటే అతడిని అందరూ రబ్బర్ బాయ్ అని పిలుస్తారు. అక్కడి వాళ్లకు ఈ యువకుడు చాలా బాగా తెలుసు. ముఖ్యంగా ఈ అబ్బాయి తన శరీరంలోని పొట్ట, నడుము, తొంటితో పాటు తలను కూడా 180 డిగ్రీల వరకూ తిప్పగలడు. కాళ్లు చేతులను అయితే 360 డిగ్రీల వరకు వంచుతాడు. అతడి పేరే హైదర్.
2010వ సంవత్సరం నుంచి తాను తన శరీర భాగాలన్నింటిని వంచడం నేర్చుకున్నాడు. ముందగా డ్యాన్స్, జిమ్నాస్టిక్స్ అలవాటు చేసుకున్న ఇతను… ప్రస్తుతం తన శరీర భాగాలన్నింటిని స్ర్పింగులా తిప్పగల్గుతున్నాడు. ఈ రబ్బర్ బాయ్ టాలెంట్ జమ్మూలో డ్యాన్స్ టీచర్ గా ఎంపికయ్యాడు. వృత్తి డ్యాన్స్ టీచర్ అయినప్పటికీ యోగా కూడా నేర్పిస్తుంటాడు. తన చేసే అన్నింటిని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. అయితే తన గోల్ ఒక్కటేనని… అంతర్జాతీయ స్థాయిలో జరిగే టాలెంట్ షోలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆరాటపడుతున్నాడు.
Read Also : Viral video: ఆ డ్యాన్స్ చూస్తే.. అది నడుమా లేక స్ప్రింగా అనే అనుమానం రాక మానదు!