Karthika deepam: మోనిత డాక్టర్​కు ఇచ్చిన డీల్​ ఏంటి..? వంటలక్క మోనిత హాస్పటల్​ను ఏం చేస్తుంది..?

Karthika deepam: వంటలక్క, డాక్టర్​ బాబు తెలియని తెలుగులోగిళ్లు ఉండవు. మరి కార్తీక దీపం సీరియల్ 16 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం. ఇంట్లోని వస్తువులన్నింటినీ సర్దుతుంది దీప. దీంతో సౌందర్య వచ్చి తనను చూస్తుంటుంది. ఏంటి అత్తయ్య నన్ను అలా చూస్తున్నారు అంటుంది దీప. చూడనీయు.. ఏమవుతుంది.. అంటుంది. ఇష్టమైన వాళ్లు వెళ్లిపోతే ఎంత బాధుంటుందో మీరు వెళ్లాకే తర్వాత అర్థమైంది అంటుంది సౌందర్య. మీరు వచ్చారు అన్నీ శుభాలే కలుగుతున్నాయి అంటుంది సౌందర్య.

karthika deepam latest highlights

వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో తెలియదు కానీ.. నువ్వు వాడికి భార్యగా దొరికావు అంటుంది సౌందర్య. మరోవైపు ఆసుపత్రిలో తన కుర్చీలో కూర్చొని దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో మోనిత వస్తుంది. లోపలికి రావచ్చా అంటుంది. కంగ్రాట్స్ మిస్టర్ కార్తీక్. వెల్ కమ్ బ్యాక్. మీ రాకకు ఈ మోనిత సంతోషిస్తుంది అంటుంది మోనిత. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి మోనిత అని అడుగుతాడు కార్తీక్.

Advertisement

కార్తీక్.. నిన్ను ఇలా డాక్టర్​గా మళ్లీ చూడటం బాగుంది. బాగలేనిది ఏంటంటే.. దీపక్క పేరు మీద వంటలక్క ప్రజా వైద్యశాల అని పేరు పెట్టానా.. నా కార్తీక్ ఆశీస్సులతో అని రాయించాను. అదే బోర్డు కింద డాక్టర్ మోనిత కార్తీక్ అని రాయించాను. ఇంట్లో ఒక ఫోటో కూడా పెట్టించాను.. అంటూ చెబుతుండగానే మోనిత ఇక ఆపుతావా. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు అంటాడు కార్తీక్.

మోనిత ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇక ఆపేయ్ అంటాడు కార్తీక్. దీంతో అవన్నీ ఆపేయడానికే వచ్చాను అంటుంది మోనిత. నాకు ఒక మాట ఇవ్వాలి దానితో అవన్ని ఆపేస్తా అంటుంది మోనిత.
వారణాసికి పని అప్పజెప్పిన దీప. అలా అనుమానంగా చూడకు కార్తీక్.

నేనేమీ పెద్ద పెద్ద కోరికలు కోరనులే. ఇవన్నీ నేను చేసినందుకు బదులుగా నువ్వు మా బాబాయికి హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటుంది మోనిత. పాపం మా బాబాయి.. చాలా సీరియస్ స్టేజ్ లో ఉన్నాడు. అమెరికాలో అయితే ఎక్కువ ఖర్చు అవుతుందని ఇక్కడికి వచ్చాడు అని చెబుతుంది మోనిత. ఆపరేషన్ డేట్ తొందరగా ఫిక్స్ చేయి.. పేషెంట్​ను తీసుకొస్తాను అంటుంది మోనిత.

Advertisement

మరోవైపు.. మన అబ్బాయిని ఎవరో ఎత్తుకెళ్లారు అంటుంది మోనిత. సర్లే.. ఆనంద రావు గారిని నేనే వెతుక్కుంటాను. బాబాయి ఆపరేషన్ సంగతి త్వరగా చూడు కార్తీక్.. అని చెబుతుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త.. అని చెప్పి వెళ్లబోతుంది. మొత్తానికి మాటిచ్చావు కదా. ఇక నా ఆట నేను ఆడుతాను అని అనుకుంటూ వెళ్లిపోతుంది మోనిత.

మరోవైపు దీప.. వారణాసికి ఫోన్ చేస్తుంది. దీంతో బస్తీలోనే ఉన్నాను అక్క అంటాడు వారణాసి. దీంతో మోనిత ఆసుపత్రికి ఎంత దూరంలో ఉన్నావు అని అడుగుతుంది. రెండు అడుగులే అక్క అంటాడు వారణాసి. దీంతో అక్కడికి వెళ్లి వీడియో కాల్ చేయి అంటుంది దీప. దీంతో సరే అంటాడు.

అక్కడికి వెళ్లి ఫోన్ చేస్తాడు. బోర్డు చూస్తుంది దీప. ఆ బోర్డును మొత్తం నాశనం చేయి అని చెబుతుంది దీప. దీంతో ఆ బోర్డును ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఇంతలో మోనిత బాబాయి వస్తాడు. బస్తీ వాసులు అక్కడికి వస్తారు. నువ్వు చెప్పినట్టే చేశాను అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు మోనిత చెప్పినట్టు వాళ్ల బాబాయికి ఆపరేషన్ చేస్తే తప్పేంటి అని అనుకుంటాడు కార్తీక్. ఒక డాక్టర్ గా పేషెంట్ ను బతికించానన్న తృప్తి ఉంటుంది. మోనిత చెప్పినట్టు అవన్నీ ఆపేస్తే బెటర్ కదా అనుకుంటాడు కార్తీక్. ఈ విషయం ఒకసారి దీపతో మాట్లాడితే బెటర్ ఏమో అనుకుంటాడు కార్తీక్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel