SBI : ఎస్బీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రెండు వారాల్లోనూ బ్యాంకు సేవలు?

Updated on: July 9, 2022

SBI : భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంతో మంది కస్టమర్లు వివిధ రకాల సేవలను పొందుతున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై సెలవు దినాలు అనగా శని ఆదివారాలలో కూడా ఈ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవల ద్వారా ఇకపై మనం బ్యాంకింగ్ సేవల కోసం సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. బ్యాంకు ప్రారంభించిన ఈ సౌకర్యాల ద్వారా మొబైల్ ఫోన్ ద్వారా మనకు కావలసిన వివరాలన్నింటినీ పొందవచ్చు.

SBI
SBI

ఈ క్రమంలోనే కస్టమర్లు ఇంటి నుంచి బ్యాంకింగ్ సేవలను పొందడం కోసం ఎస్బిఐ రెండు టోల్ ఫ్రీ నెంబర్లను విడుదల చేసింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి బ్యాంకు సేవలను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ సేవలు శని ఆదివారాలలో కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని ఎస్బిఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎస్బిఐ టోల్ ఫ్రీ నెంబర్స్ ఎస్బీఐ సంప్రదింపు కేంద్రం టోల్ ఫ్రీ నంబర్‌కు 1800-1234 లేదా 1800-2100కు కాల్ చేయడం ద్వారా మీ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోవచ్చు.

SBI : ఎస్బిఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కస్టమర్లు శని ఆదివారాలు బ్యాంకు సేవలు..

Advertisement

మొబైల్ నెంబర్ లేదా ల్యాండ్ లైన్ నుంచి కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఏకంగా ఐదు రకాల సేవలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సర్వీస్ ఖాతాలో 24×7 బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. చెక్ బుక్ డెస్పాచ్ స్టేటస్ , సేవింగ్స్‌పై వడ్డీ, TDS సమాచారం, గతంలో బ్లాక్ చేసిన లావాదేవీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏటీఎమ్‌ కార్డ్ రిక్వెస్ట్‌ను బ్లాక్ చేసినట్లయితే డిస్పాచ్ స్టేటస్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎస్బిఐ సూచించింది. నిజంగానే ఇది ఎంతోమంది కష్టమర్లకు ప్రయోజనకరమైన సేవలని చెప్పాలి.

Read Also :  LPG Gas Subsidy : ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel