Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి ధర కూడా స్వల్పంగానే పె

By Vinod Kumar

Published on: April 14, 2022 11:25 AM

Updated on: April 14, 2022 11:25 AM

---Advertisement---

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి ధర కూడా స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices hike today 1

Advertisement

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,810 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది. విజవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,810 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,480గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,810 గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,480గా ఉంది. అలాగే ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,810 గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,480 ఉంది.

అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 5 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,976 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.81 డాలర్లుగా ఉంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.