Karthika Deepam November 26 Today Episode : దీపను గన్ తో షూట్ చేసిన మోనిత.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయిన సౌందర్య?

Updated on: November 26, 2022

Karthika Deepam November 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కార్తీక్ ఇద్దరు సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో దీప బాధపడుతూ ఉండగా అప్పుడు కార్తీక్ నాకు గతం గుర్తు లేకపోవచ్చు కానీ వర్తమానం గుర్తుకు ఉంది. నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తే నాకు నిజంగానే నేను నీ భర్తను అన్నా అనుమానం వస్తుంది. నేను నీ భర్తనే అనుకో దీప అనడంతో వెంటనే ఆశ్చర్యపోయిన దీప ఏమన్నారు డాక్టర్ బాబు అని అనగా నిజమే దీప నీతోనే ఉండాలనిపిస్తుంది నీ సమస్యలు నా సమస్యలుగా అనిపిస్తున్నాయి. ఏం చేసైనా నిన్ను సంతోషంగా చూసుకోవాలనిపిస్తోంది అనడంతో సంతోషంతో వంటలక్క డాక్టర్ బాబుని హత్తుకుంటుంది.

Karthika Deepam November 26 Today Episode
Karthika Deepam November 26 Today Episode

ఆ తర్వాత దీప కార్తి ఇద్దరూ కలిసి సౌర్యని వెతకడానికి వెళ్తారు. మరొకవైపు చంద్రమ్మ దంపతులు సౌర్య కలసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా అప్పుడు శౌర్య తన అమ్మానాన్నలను తలచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య వాళ్ళు సౌర్య కోసం వెతుకుతుండగా కార్తీక్ దీప కూడా సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలోనే అనుకోకుండా సౌందర్య, సౌర్య వాళ్ళు ఒకచోట కలుసుకోవడంతో అప్పుడు సౌర్య ఆనందంతో వెళ్లి సౌందర్య హత్తుకుంటుంది. అప్పుడు సౌందర్య మా మనవరాలుని అప్పగించమని చెబితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా అని ఇంద్రుడిని కొట్టబోతుండగా సౌర్య అడ్డుపడుతుంది.

Advertisement

అదేంటి రానమ్మ ఆరోజు నువ్వు నన్ను తీసుకెళ్లడానికి రాలేదని బాబాయ్ తో చెప్పావంటే కదా అనడంతో నిన్ను ఇలా అబద్ధాలు చెప్పి మాకు దగ్గర కాకుండా చేస్తున్నారు సౌర్య అని అంటుంది. అప్పుడు ఆనంద్ రావు మీ అమ్మానాన్నలు నీకోసం వచ్చారని తెలిసి వాళ్లు నిన్ను ఈ ఊరు నుంచి తీసుకొని వెళ్ళిపోయారు అనడంతో సౌర్య నిజమా బాబాయ్ అని నిలదీయగా వెంటనే ఇంద్రుడు సౌందర్య కాలు పట్టుకుని క్షమించమని అడుగుతాడు. అప్పుడు సౌందర్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరూ సౌర్య కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు శౌర్య సౌందర్య గొంతు వినిపించడంతో అక్కడికి వెళ్తారు.

Karthika Deepam నవంబర్ 26 ఎపిసోడ్ : ఇంద్రుడు నిజ స్వరూపం తెలుసుకున్న సౌందర్య షాక్.. 

కార్తీక్ దీపలను చూడడంతో ఆనందరావు హిమ వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి సంతోషంగా ఉండగా ఐకపై మన కుటుంబాన్ని ఎవరు విడదీయలేరు అని దీప అనడంతో వెంటనే మోనిత గన్ తో దీపని షూట్ చేస్తుంది. అయితే అదంతా జరిగినట్టు ఆనందరావు కలగంటాడు. మరొకవైపు సౌందర్య కారులో వెళుతూ మొదటసౌర్య దగ్గరికి వెళ్లి ఆ తర్వాత ఆ మోనిత దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. సౌర్య ఇంటి దగ్గరికి వెళ్లడంతో అక్కడ తలుపులు వేసి ఉండగా తిరిగి అక్కడ నుంచి వెళ్ళిపోతుండడంతో ఇంతలో అక్కడికి ఇంటి ఓనర్లు వస్తారు.

అప్పుడు సౌందర్య సౌర్య గురించి ఎంక్వైరీ చేస్తుంది. మరొకవైపు దీప ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు దీప శౌర్య పోస్టర్ చూపించడంతో కార్తీక్ సంతోషపడతాడు. సరే దీప మొదట నువ్వు హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకో ఆ తర్వాత సౌర్య కోసం వెతుకుదాము అని అంటాడు. అప్పుడు దీప సరే అని అనడంతో ఇంతలోనే దీప వాళ్ళ ఇంటి ఓనర్ అక్కడికి వస్తుంది. నన్ను క్షమించండి డాక్టర్ బాబు మీ గురించి తెలియక మీ గురించి తప్పుగా మాట్లాడాను అని అనడంతో సరే సరే అని అంటాడు కార్తీక్.

Advertisement

ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. మరొకవైపు సౌందర్య ఇంద్రుడు వాళ్ల అసలు నిజ స్వరూపం తెలుసుకుని షాక్ అవుతుంది. అంతేకాకుండా దీప, కార్తీక్ లో బతికే ఉన్నారని ఆ ఇంటి ఓనర్ చెప్పడంతో సంతోష పడుతూ ఉంటుంది సౌందర్య. మరొకవైపు హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన కార్తీక్ దీపక్ గతంలో వచ్చిన జబ్బు మళ్ళీ వచ్చింది ఎలా వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటూ ఉంటాడు.

Read Also : Karthika Deepam: దుర్గ పీడ వదిలించుకున్న మోనిత.. అసలు విషయం తెలుసుకుని షాకైన కార్తీక్?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel