Karthika Deepam: దుర్గ పీడ వదిలించుకున్న మోనిత.. అసలు విషయం తెలుసుకుని షాకైన కార్తీక్?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఇంద్రుడు చేసిన పనికి దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ చదువుకుంటూ ఉండగా ఇంతలో ఆనంద్ రావు, సౌందర్య అక్కడికి వచ్చి బాగా చదువుకో హిమ బాగా చదివి మీ నాన్న లాగా డాక్టర్ అవ్వాలి అని అంటారు. అప్పుడు హిమ నేను బాగా చదివి డాక్టర్ అవుతాను సౌర్య అని పిలుచుకొని రండి తను కూడా బాగా చదివి కలెక్టర్ అవుతుంది అని అంటుంది హిమ. మరి తమ్ముడు నీ పెద్దయ్యాక ఏం చేద్దాం అని అనగా అది తర్వాత చూద్దాంలే ఇప్పుడు వెళ్లి తమ్ముడితో అడుగు అంటుంది సౌందర్య. తర్వాత హిమ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సౌందర్య ఆనందరావు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఆ తర్వాత మోనిత చేసిన పనికి కోపంతో రగిలిపోతూ ఉంటారు.

Advertisement

అప్పుడు ఆనంద్ రావు ఆ మోనిత మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అనగా అప్పుడు సౌందర్య వద్దు నేను వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూసిన తర్వాత అప్పుడు కంప్లైంట్ ఇద్దాము అని అంటుంది. మరొకవైపు సరికొత్త ప్లాన్ వేసిన మోనిత ఒక ఆమెకు డబ్బులు ఇచ్చి నేను చెప్పినట్టు చెయ్ అని అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత దుర్గ కి ఫోన్ చేసి కావాలనే దనిదుర్గనీ రెచ్చగొట్టి మీకు ఒక లొకేషన్ పంపుతాను అక్కడికి వచ్చే అని అంటుంది. మరొకవైపు దీప సౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో దీప అలాగే నిదానంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది.

మరొకవైపు కార్తీక్ కారులో దీప దగ్గరికి వస్తూ దీప అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఒకటే వెతుకుతుంది పాపం అనుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత దుర్గ మోనిత చెప్పిన చోటికి వెళ్లి ఏంటి బంగారం రా చూసుకుందాం తేల్చేద్దాం అన్నావు ఇక్కడ ఎవరో రౌడీలు ఉంటారనుకున్నాను కానీ ఏంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనడంతో నిన్ను పంపించడానికి మళ్లీ రౌడీలు అవసరమా అని వనిత కాన్ఫిడెంట్ గా మాట్లాడడంతో అప్పుడు దుర్గ నన్నెక్కడికి పంపిస్తావు బంగారం నిన్ను మరింత చిత్రహింసలు పెట్టే వరకు నేను ఊరుకోను కదా అంటుండగా ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి దుర్గని లాక్కెళ్తారు.

అది చూసిన కార్తీక్ మోనిత బయటికి వెళ్తాను అని చెప్పి ఇలాంటి పని చేస్తుందా దీనినీ తక్కువ అంచనా వేయకూడదు ఇకపై దీప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకొని అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తర్వాత మొత్తానికి దుర్గ గాడి పీడ విరగడయింది అనుకొని సంతోష పడుతూ ఉంటుంది మోనిత. మరొకవైపు సౌందర్యం మోనిత దగ్గరకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడు హిమ నాన్నమ్మ ఫస్ట్ మీరు సౌర్య దగ్గరికి వెళ్ళండి ఆ తర్వాతనే మోనిత దగ్గరికి వెళ్ళండి అని అంటుంది.

Advertisement

ఇప్పుడు సౌందర్య నాకు తెలుసులేవే నువ్వు బుద్ధిగా స్కూల్ కి వెళ్లి చదువుకో అని అంటుంది. మరొకవైపు మోనిత ఆ దుర్గ గాడి పీడ విరగడయింది అని సంతోషపడుతూ ఇప్పుడు ఆ వంటలక్క కూడా ఇంట్లో లేదు ఎలా అయినా ఏదో ఒకటి నచ్చజెప్పి కార్తీక్ నీ నా వైపు తిప్పుకోవాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే డ్రైవర్ శివ అక్కడికి వస్తాడు. మేడం సారు లేరు మేడం ఇప్పుడే ఆ వంటలక్క దగ్గర నుంచి ఫోన్ రావడంతో హడావిడిగా ఇప్పుడే వస్తానని వెళ్లిపోయారు అనడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు సౌర్య గనుక కార్తీక్ ని చూస్తే కార్తీక్ గత మొత్తం గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది మోనిత.

మరొకవైపు కార్తీక్ దీప సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఆనందరావు హిమ సౌందర్యలు కూడా సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత దీపకి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో ఒక ప్రదేశంలో కూర్చుని ఉంటుంది. అప్పుడు కార్తీక్ తో మాట్లాడుతూ ఏంటో డాక్టర్ బాబు నాకు ఈ కష్టాలు ఒక్కొక్కసారి ఈ బాధలు పడేదానీ కంటే మళ్లీ ఏదో ఒక ప్రమాదం జరిగి చనిపోతే మేలనిపిస్తుంది డాక్టర్ బాబు అనటంతో కార్తీక్ అలా మాట్లాడకు దీప అని అంటాడు. మరి ఏం చేయాలి డాక్టర్ బాబు అని అనడంతో వెంటనే కార్తీక్ ఒక పని చెయ్ దీప నువ్వు ఎలాగో నన్ను నీ భర్తని అనుకుంటున్నావు కదా నన్ను నీ భర్తని అనుకో అనడంతో దీప షాక్ అవుతుంది.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel