వర్క్ ఫ్రం హోం చేసేవారికి బిఎస్ఎన్ఎల్ వారి బంపర్ ఆఫర్.. ఏంటంటే..?

కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్​ పెరిగింది. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులంతా వర్క్​ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వీరి అవసరాలకు తగ్గట్లు ప్రముఖ టెల్కో​ కంపెనీలు సరికొత్త డేటా ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్​ సంచార్​ నిగమ్​ లిమిటెడ్​ (బీఎస్​ఎన్​ఎల్​) సరికొత్త వర్క్​ ఫ్రమ్​ హోమ్​ డేటా ప్లాన్​ను ఆవిష్కరించింది. రూ. 599లకే 84 రోజుల వ్యాలిడిటీ గల బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్​ను ప్రారంభించింది. ఈ ప్లాన్​ కింద ప్రతి రోజూ 5 జీబీ డేటా ఆఫర్​ చేస్తుంది. అయితే, స్పీడ్​ మాత్రం తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ అవసరం లేని వినియోగదారులు రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఎంచుకోవచ్చు.

బీఎస్​ఎన్​ఎల్​ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ STV 599 ప్లాన్ ప్రస్తుతం​ ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్​ కింద ప్రతి రోజూ 5జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ప్రతి రోజూ 5 జీబీ డేటా లిమిట్​ పూర్తయిన తర్వాత, డేటా స్పీడ్​ 80 Kbpsకి పడిపోతుంది. MTNL నెట్‌వర్క్‌లతో సహా ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ప్లాన్ కింద రోజుకు 100 ఉచిత ఎస్​ఎమ్​ఎస్​లను అందిస్తుంది. బీఎస్​ఎన్​ల్​ వెబ్‌సైట్ లేదా సెల్ఫ్-కేర్ యాక్టివేషన్ ద్వారా ఈ ప్లాన్​ను యాక్టివేట్ చేయవచ్చు. బీఎస్​ఎన్​ఎల్​ రూ. 251 ధరతో వర్క్ -ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు 70 జీబీ డేటాను అందిస్తుంది.
ఈ ప్లాన్​తో అపరిమిత కాలింగ్ లేదా ఎస్​ఎమ్​ఎస్​ ప్రయోజనాలను పొందాలనుకుంటే విడిగా రీఛార్జ్ చేసుకోవాలి. బీఎస్​ఎన్​ఎల్​ రూ. 151 ధరతో వర్క్-ఫ్రమ్-హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో 40 జీబీ డేటాను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లు పాన్ ఇండియా కస్టమర్లందరికీ వర్తిస్తాయి.

Advertisement

వినియోగదారులు బీఎస్​ఎన్​ఎల్​ ఆన్‌లైన్ రీఛార్జ్ పోర్టల్, మై బీఎస్​ఎన్​ఎల్​ యాప్, రిటైలర్, ఇతర థర్డ్-పార్టీ సైట్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఇక, ప్రైవేట్​ టెల్కో సంస్థ వొడాఫోన్​ ఐడియా రూ. 298, రూ. 418 ధరలతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ వర్క్-ఫ్రమ్-హోమ్ ప్లాన్లు వరుసగా 28 రోజులు, 56 రోజుల పాటు 50 జీబీ, 100 జీబీ డేటాను అందిస్తాయి. అదనంగా వీఐ మూవీస్​, టీవీ యాక్సెస్ లభిస్తుంది. జియో రూ.181, రూ.241, రూ. 301 వద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్లను ఆఫర్​ చేస్తుంది. ఈ ప్లాన్ల కింద వరుసగా 30 జీబీ, 40 జీబీ, 50 జీబీ డేటా లభిస్తుంది.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel