Viral video: నేనేమైనా తక్కువనా.. నేనూ అలాగే చేస్తా..!

Viral video: పెళ్లి అంటే ఓ మధుర జ్ఞాపకం. అది జీవితంలో ఒక్క సారి వచ్చే అతి పెద్ద పండగ. రెండు జంటలు శారీరకంగా, మానసికంగా ఒక్కటి అయ్యే గొప్ప క్షణం. ఈ సందర్భంగా జరిగే ఎలాంటి ఘటన అయినా జీవితాంతం గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలా మంది ఈ పెళ్లి అనే అతి పెద్ద శుభకార్యాన్ని సాధ్యమైనంత ఘనంగా జరుగుకోవడానికి తాపత్రయ పడతారు. ఎప్పటికీ గుర్తుండేలా డ్యాన్స్ లు, పాటలు, జోక్ లు ఇలా ఎన్నెన్నో చేస్తుంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అవి చాలా మందిని అలరిస్తుంటాయి.

ముఖ్యంగా వధూ వరులకు సంబంధించిన వీడియోలు భలే ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వధూ వరులు చేసిన ఓ పని నవ్వులు పూయిస్తోంది. అసలేం జరిగిందో ఇది చదివి తెలుసుకోండి.

Advertisement

వివాహ వేడుకలో భాగంగా కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించు కుంటున్నారు. అయితే వధువు లడ్డూ తినిపించేందుకు ప్రయత్నిస్తుంది. దానికి వరూడు నోరు బిగుసుకుని ఉంటాడు. అయినా వధువు ఏమాత్రం సంకోచించకుండా నోట్లో లడ్డూ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. తర్వాత వధువు వంతు వస్తుంది. వరుడు లడ్డూ తీసుకుని వధువుకు తినిపించేందుకు ప్రయత్నించగా.. వధువు నోరు బిగుసుకుంటుంది. ఇప్పుడు అచ్చం ఆమె చేసినట్లుగానే అతడూ బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నిస్తాడు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel