Wife Image: భార్య ఫోటోని వాటాప్స్ డీపీగా పెడుతున్నారా… భర్తలు జాగ్రత్త!

Wife Image: చాలా మంది భర్తలు తమ భార్యలపై ఉన్న అభిమానంతో ఫేస్ బుక్, వాట్సాప్ లలో తన భార్య ఫోటోలను ప్రొఫైల్ ఫోటో పెడుతూ ఉంటారు. ఇలా భార్య ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టే భర్తలకు హెచ్చరిక. ఈ విధంగా భార్య ఫోటో ప్రొఫైల్ ఫోటో పెట్టే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను ఓ అగంతకుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది.

సదరు వ్యక్తి తన భార్య ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు ప్రొఫైల్ ఫోటోలు సేవ్ చేసుకొని తన భార్య ఫోటోనే మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోగా మార్చేశారు. ఈ క్రమంలోనే ఆ ఫోటోని ఆ భర్తకు పంపించి తనని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.ఈ క్రమంలో తను అడిగిన డబ్బు చెల్లించకపోతే తన భార్య నగ్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు.

ఈ క్రమంలోనే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ వ్యక్తి స్థానిక పోలీసులను సంప్రదించి అసలు విషయం తెలియజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుడిని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు మరి డబ్బు కోసం దారుణంగా ప్రవర్తిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సప్ ప్రొఫైల్ పెట్టుకోవాలి అనుకునేవారు సెట్టింగ్ లోకి వెళ్లి కేవలం మనకు కావలసిన వారు మన ప్రొఫైల్ ఫోటో చూసే విధంగా సెట్ చేసుకోవడంతో ఇలాంటి సమస్యలు ఉండవు.లేకపోతే తమ భార్య ప్రొఫైల్ ఫోటోలను పెట్టకుండా ఉండటం ఇంకా మంచిది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel