Karthika Deepam : ఆపరేషన్ జరిగిన పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నా మోనిత!

Updated on: February 7, 2022

Karthika Deepam Feb 7 Episode Today : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంజలి, మోనిత భారతి ల దగ్గరికి వచ్చి కాస్త వంటల కార్యక్రమం చూసుకోండి అని చెబుతోంది. ఇక దాంతో మోనిత చిరాకు పడుతూ వంటలు చేసే దగ్గరికి వెళుతుంది.

మోనిత అక్కడ వంటలు చేస్తున్న కార్తీక్ ను చూసి ఆశ్చర్య పడుతుంది. ఆ విషయాన్ని భారతితో చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక భారతి కూడా కార్తీక్ ను చూడ్డానికి వస్తోంది. కానీ అక్కడ కార్తిక్ ఉండడు అదే షర్ట్ తో వేరే వంటమనిషి ఉంటాడు. దాంతో భారతి, మోనిత బ్రమ పడుతుందేమో అని అక్కడి నుంచి తీసుకుని వెళుతుంది.

ఇక ఆ తర్వాత దీప ఇంట్లో వాళ్లకు టీ తీసుకొని వెళుతుంది. భారతి ఒక దగ్గర ఫోన్ మాట్లాడుతుండగా దీప టీ ను భారతి కి ఇవ్వబోతూ.. భారతి ను కనిపెడుతుంది. ఇక దీప అక్కడి నుంచి వేరేచోటికి వెళ్లి దాక్కుంటుంది. అదే క్రమంలో మోనిత ను కూడా చూసి దీప మరో సారి స్టన్ అవుతుంది. ఇక అక్కడి నుంచి దీప కార్తీక్ దగ్గరకు వస్తుంది.

Advertisement

Karthika Deepam Feb 7 Episode Today : మోనిత డాక్టర్ బాబును చూస్తుందా? 

ఇక కార్తీక్, కు దీప.. భారతి, మోనితలు ఇక్కడ ఇక్కడే ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడి నుంచి ఎలాగైనా ఇప్పుడు వెళ్లిపోవాలి అని అంటుంది. దానికి కార్తీక్ మరి ఇంత సహాయం చేసిన డాక్టర్ అంజలికి ఎలా ద్రోహం చేయమంటావ్ అని అంటాడు. మీరు చెప్పింది కరెక్టే కానీ వాళ్ళిద్దరు మనల్ని ఎక్కడ చూస్తారో అని టెన్షన్ గా ఉంది అని చెబుతోంది.

దానికి కార్తీక్ త్వరగా వంటలు పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం అంటాడు. అలా వంటలు త్వరగా పూర్తిచేసుకుని వెళ్లడానికి సిద్ధమవ్వగా అంజలి అక్కడకు వచ్చి కేక్ కట్ చేసిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి అని అంటుంది. దాంతో కార్తీక్ తన మెడలోని టవెల్ తో ఫేస్ ను హైడ్ చేసి బర్త్డే పార్టీ దగ్గరకు వెళతాడు.

ఇక అక్కడ అంజలి, కార్తీక్ ను అందరికీ కేక్ ను పంచమని చెబుతుంది. అలా పంచుతున్న సమయంలో కార్తీక్ మోనిత కు కేకు ఇవ్వబోతుండగా.. మోనిత కార్తీక్ ని చూసి.. కార్తీక్ ల బ్రమ పడుతున్నానేమో అని అనుకుంటుంది.

Advertisement

ఈ క్రమంలో మోనిత హాట్ ఆపరేషన్ చేసిన పాప తల్లిదండ్రులు వివరాలు అడగగా.. దానికి అంజలి ఇందాక కేక్ పంచిన వాళ్లే..వాళ్ళ తల్లిదండ్రులని చెబుతుంది. దాంతో మోనిత షాక్ అవుతూ.. వాళ్ళ వైపు చూస్తుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Guppedantha Manasu : రిషి, దేవయాని లు మాట్లాడుకున్న మాటలు విని మహేంద్ర ఏం చేశాడంటే!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel