Healthy tips : మీ ఎముకలు ఇనుములా గట్టిగా మారాలంటే ఈ ఆకు కూర తినాల్సిందే..!

Updated on: April 21, 2022

Healthy tips : ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచివని అందరికీ తెలిసిదే. కానీ ఆకు కూరలు తినడానికి చాలా మంది ఇష్ట పడరు. వారానికి రెండు సార్లు అయినా ఆకు కూరలు తినాలని చెబుతుంటారు. అందుకే చాలా మంది తమకు ఇష్టం లేకపోయినా వారానికి ఓ రెండు సార్లు ఆకు కూరల్ని తింటుంటారు. సలాడ్స్, కూరలు చేస్కుంటూ ఉంటారు. అయితే తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర వంటివి అందరికీ తెలుసుకు. వీటినే మనం ఎక్కువగా తింటుంటాం. కానీ ఎన్నో విటామిన్లు, లవణాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న గంగవాయిలి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని కూడా వారంలో ఒకసారి తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Healthy tips
Healthy tips

గంగవాయిలి కూరలో ఉండే విటామిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన కణ విభజనకు దన్నుగా నిలుస్తుంది. ఇక విటామిన్ సి శరీరంలో కొల్లాజెన్, రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, గాయాలను నయం చేయడానికి సహకరిస్తుంది. గంగవాయిలిలో బీటా కెరోటిన్ అధికం. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అలాగే ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం వంటివి కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఎముకల ధృఢత్వానికి అది బాగా పని చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు ఈ గంగవాయిలి కూరలో ఉండే ఒమెగా- ఆమ్లాలు గండుపోటు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

Read Also : Health Tips: మహిళలు వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్ పెట్టండి! 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel