Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Ragi Health benefits : రాగులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు… నిత్య యవ్వనంగా ఉంటారు తెలుసా?

Ragi Health benefits : మన పూర్వీకులు రాగులను కంపల్సరీగా తమ ఆహారంలో భాగం చేసుకునేవారని పెద్దలు చెప్తుంటారు. అయితే, కాలక్రమంలో జీవనశైలి బాగా మారిపోయింది. దాంతో ఆ

By Vinod Kumar

Published on: December 28, 2022 10:13 AM

Updated on: December 28, 2022 10:13 AM

Ragi Healthbenefits in telugu

---Advertisement---

Ragi Health benefits : మన పూర్వీకులు రాగులను కంపల్సరీగా తమ ఆహారంలో భాగం చేసుకునేవారని పెద్దలు చెప్తుంటారు. అయితే, కాలక్రమంలో జీవనశైలి బాగా మారిపోయింది. దాంతో ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అలా ఇప్పుడు బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకునే పరిస్థితులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనాలు తొందరగా అనారోగ్యాల బారినపడుతున్నారు. కాగా, రాగులు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు, పెద్దలు చెప్తున్నారు.

Ragi Healthbenefits in telugu
Ragi Healthbenefits in telugu

మానవశరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ధాన్యాలు అయిన రాగులను ప్రతీ  ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. రాగులను జావా చేసుకుని తాగే వారిని బోలెడు మంది మనం చూడొచ్చు కూడా. వేసవి కాలంలో రాగి జావా విరివిగా లభిస్తుంటుంది. ఇది తీసుకోవడం వలన డీ హైడ్రేషన్ సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి. ఇందులో ఉండే యాసిడ్స్ అన్ని కూడా హెల్త్‌కు చాలా మంచివి.

Advertisement

ముఖ్యంగా ఇందులో ఉండే అమినో యాసిడ్ ఆకలిని తగ్గించడంతో పాటు వెయిట్ లాస్ అయ్యేందుకు దోహదం చేస్తుంది. ఇకపోతే ఇందులో ఉండే ఫైబర్ హెల్త్‌కు చాలా అవసరమైంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్‌లో బలవర్ధకమైన ఆహార పదార్థాలు దొరకడం లేదు. అంతా కల్తీమయం అవుతున్న నేపథ్యంలో రాగులను తీసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముకలు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

Ragi Healthbenefits in telugu
Ragi Healthbenefits in telugu

రాగులను క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వడం ద్వారా అందులో ఉండే క్యాల్షియం పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. రాగులు ముఖ్యంగా మహిళలు తీసుకుంటే చాలా ఉపయోగకరమట. అది వారికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ అన్నిటినీ అందిస్తుంది. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకంటే ఎప్పుడూ అందంగా ఉండొచ్చు. ఇవి మీ వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడతాయట. స్కిన్‌ను  మెరిసేలా చేయడంతో పాటు మృదువుగా ఉంచేందుకు ఇవి సాయం చేస్తాయి. ఫలితంగా మీరు యవ్వనంగా కనిపించొచ్చు.

Read Also : Health Tips : వేసవి కాలంలో రాగి అంబలితో కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Advertisement

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.