Makka Roti : మొక్కజొన్న రొట్టెతో ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసా…

Updated on: February 2, 2023

Makka Roti : ” మొక్కజొన్న రొట్టె “… దీనినే మక్క రొట్టే అని కూడా అంటారు. చలికాలంలో ఈ మక్కరొట్టెను తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, పాస్పరస్, కాపర్, సెలీనియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి… అందువల్ల ఇది కళ్లకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అలానే మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలో అధిక మొత్తంలో కెరోటినాయిడ్లు, విటమిన్ ఎ లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా… మన శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరగడానికి దోహదపడతాయి. ఎర్ర రక్తకణాలు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది. మొక్కజొన్నలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా మొక్కజొన్నలో పీచు ఎక్కువగా లభిస్తుంది. మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి అనుమతించదు. మొక్కజొన్న రొట్టె గుండెజబ్బులను తగ్గిస్తుంది.

health-benefits-of-eating-makka-roti-in-telugu
health-benefits-of-eating-makka-roti-in-telugu

దీంతో పాటు మొక్కజొన్నలో ఎక్కువ శాతంలో పీచు పదార్థం ఉండడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని తీసుకోవడం వలన త్వరగా ఆకలి వేయదు. దీంతో తరచు తినే అలవాటు తగ్గుతుంది. అందువలన బరువు తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి, రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటు సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మంచిది.

Advertisement

Read Also : Ayurvedic Tips for Cough : ఊపిరాడనంతగా దగ్గు వస్తుందా..? ఒకే ఒక్క ఆయుర్వేద చిట్కా..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel