Ayurvedic Tips for Cough : వాతావరణం మారుతున్న కొద్దీ కొందరిలో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వర్షాకాలంలో జలుపు, జ్వరం, తలనొప్పి ఎలా వస్తుంటాయో.. శీతాకాలంలో కొందరికి శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు, కఫం, పొడి దగ్గు, ఊపిరాడనంతగా దగ్గుతో పాటు ఛాతీలో మంట బాధిస్తుంటాయి. అయితే, ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక్క ఔషధాన్ని మీ వంటింట్లోనే తయారు చేసుకోవచ్చని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని ఉదయం, రాత్రివేళ తీసుకుంటే దగ్గు, కఫం, పొడిదగ్గు తగ్గిపోయి శ్వాసతీసుకోవడంలో రిలీఫ్‌గా ఉంటుందని తెలుస్తోంది.
ముఖ్యంగా సాధారణ, పొడిదగ్గు ఉన్నవారు ‘వాము’ను తీసుకోవాలి. ఇందులో యాంటీటిస్సివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనికి జలుబు, పొడిదగ్గును నివారించే పవర్ ఉంటుంది. రోగనిరోధక శక్తి ని పెంచడంలో తోడ్పడుతుంది. ఆస్తమా రోగులు రెగ్యులర్‌గా వామును తినడం వలన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తప్పుతాయి.
‘పిప్పళ్లు’.. ఈ పదార్థం కూడా జలుబు, తలనొప్పి నుంచి మంచి ఉపశమనం కలిస్తాయి. పిప్పుళ్లు శ్లేష్మాన్ని వదిలించి దగ్గును తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాతి పదార్థం ‘దుంపరాష్ట్రం’..ఇది కూడా జలుబు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే తొలగిస్తుంది. ఇమ్యునిటీ పవర్ ను పెంచి శ్వాసతీసుకోవడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా నివారిస్తుంది. అదేవిధంగా ‘కరక్కాయ’లో కూడా మంచి ఔషధ గుణాలున్నాయి.
ఇది బ్యాక్టీరియా అభివృద్ధిని అడ్డుకుంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంటుంది. ‘మిరియాల పొడి’ కూడా దగ్గు, కఫం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ముందుగా ఈ పదార్థాలను ఒక గిన్నెలో వేసుకుని అందులో నీరు పోసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చి అందులో టేబుల్ స్పూన్ తేనె వేసి పొద్దున, సాయంకాలం తీసుకోవడం వలన పొడి దగ్గు, కఫం, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు తెలిపారు.
Read Also : Mirror Vasthu Tips : ఇంట్లో అద్దం ఆ వైపు పెడితే భార్యభర్తలు విడిపోతారట.. మరో వైపు పెడితే అల్లకల్లోలమే..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world