Mirror Vastu Tips : కొత్త ఇంటిని మొదలుపెట్టాలన్నా.. కొత్త ఇంట్లోకి ప్రవేశించాలన్నా.. ఇల్లు మారాలన్నా ముందుగా వాస్తునే పరగణలోకి తీసుకుంటారు. వాస్తు అనుకూలంగా ఇంట్లో నివసిస్తే ఎలాంటి ఆటంకాలు తలెత్తవని జ్యోతిష్కులు, వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే ఇల్లు మాత్రమే వాస్తుకు ఉంటే సరిపోతుందా? ఇంట్లోని వస్తువులు సైతం వాస్తుకు తగ్గట్టుగా ఉండాలని, అలాంటప్పుడే కుటుంబం అన్ని విధాల బాగుంటుందని పండితులు, జ్యోతిష్కులు చెప్తున్నారు.
వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇంట్లో వస్తువులను సైతం ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తుండగా, పెద్దలు సైతం అదే చెబుతున్నారు. వాస్తుకు సంబంధించి కొన్ని వస్తువులు ఎలా ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటిస్తే ఆనందంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు.
అద్దం ఈ వైపు ఉంచకూడదు..
ఉదయం లేవగానే అద్దంలో మనం ముఖం చేసుకుంటాం. మరి వాస్తు ప్రకారం ఆ అద్దం ఏవైపు ఉండాలో అనే విషయానికి వస్తే.. ఇంట్లో ఆగ్నేయం వైసు అద్దం ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు ఎక్కువవుతాయి. వాస్తు దోషం వల్ల భార్యాభర్తల మధ్య అసమ్మతి పెరిగి విడిపోయే ప్రమాదముంది. నైరుతి వైపు అద్దాన్ని ఉంచితే ఇంటి పెద్ద మీద చెడు ప్రభావం పడటంతో పాటు అనవసర ఖర్చులు పెరిగి అశాంతితో, చికాకుతో ఇబ్బందులు దరి చేరుతాయి. వాయువ్యం వైపు అద్దం ఏర్పాటు చేస్తే అనవసర గొడవలు పెరుగుతాయి.
ఏ వైపు ఉంచితే ప్రయోజనం :
అద్దాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపున ఉంచాలి. అద్దంలో చూసుకునే వారి ముఖం ఎప్పుడూ తూర్పువైపున లేదా ఉత్తరం వైపునే ఉండేలా చూసుకోవాలి. ఇలా అద్దాన్ని ఏర్పాటు చేస్తే వాస్తు ప్రకారం సానుకూల శక్తి వస్తుందని నమ్మకం. బెడ్ రూంలో అద్ధం ఏర్పాటు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అద్దం దూరంగా ఉండేలా చూసుకోవాలి. అద్దంలో మంచం కనిపించకుండా అద్దాన్ని అమర్చుకోవాలి. అలా కుదరకపోతే నిద్రపోయే సమయంలో అద్దంపై ఓ తెరను కప్పాలి. అలా చేస్తే వాస్తు దోషానికి గురికాకుండా ఉంటాం. ఇది కేవలం వాస్తు శాస్త్రం ఆధారంగా మాత్రమే చెప్పిన విషయాలు, వీటికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు.
Read Also : Thyroid Disease : థైరాయిడ్ వ్యాధి ప్రాణాంతకమా.. వస్తే ట్రీట్మెంట్‌తో క్యూర్ అవుతుందా..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world