Signs Of Cancer : మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వాటిని సాధారణంగా భావించకండి..!

Updated on: February 1, 2023

Signs Of Cancer : ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఆరోగ్య సమస్య లలో క్యాన్సర్ కూడా ఒకటి. ఏటా కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని పేరు వింటేనే ప్రజలు వనికిపోయెలాగ ఈ వ్యాధి తయారయింది. ఈ వ్యాధిని గుర్తించినప్పటినుండి దాని నుండి బయట పడే వరకు, దీన్ని నిరోధించడానికి జరిగే ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే అంత ప్రాణాంతకమేమి కాదు. కానీ ఈ వ్యాధిని మొదటి స్టేజ్ లో గుర్తించడం చాలా కష్టం. క్యాన్సర్ రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు, గర్భాశయానికి ఎక్కువగా వస్తుంది.

Do Women Have these Symptoms there is a chance to cancer also
Do Women Have these Symptoms there is a chance to cancer also

మానవ శరీరం మొత్తం కణజాలాల తో నిండిపోయి ఉంటుంది. శరీరంలో కణాల విభజన జరుగుతుంది, విభజన జరిగినప్పుడు కణాలు చనిపోవడం, పుట్టడం జరుగుతుంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. తల్లిదండ్రుల నుంచి డిఎన్ఏ వారి పిల్లలకు వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే, అయితే క్యాన్సర్ కూడా తల్లిదండ్రుల నుంచి కూడా సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ఇవేగాక ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం వల్ల డి ఎన్ ఏ లో మార్పులు సంభవించి శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, ఇవి కనుతులుగా ఏర్పడతాయి, దీన్నే క్యాన్సర్ అంటారు.

మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లకు గురవుతుంటారు. మహిళలో వచ్చే కొన్ని లక్షణాల వల్ల క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చనీ బెంగళూరులోని ఫోర్టీస్ లా ఫెమ్మె హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గీత్ మొన్నప్ప తెలిపారు.

Advertisement

మహిళలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఏటా 2.1 మిలియన్ల మహిళలు ఈ సమస్యకు గురవుతున్నారు అంటే దీని ప్రభావం ఎంతలా ఉందో తెలుసుకోవచ్చు. రొమ్ములో ఆకస్మికంగా సంబంధించి మార్పులను అసలు విస్మరించకూడదు. రొమ్ము చర్మంమీద మార్పులు వస్తాయి, చనుమొనల నుండి రక్తస్రావం జరుగుతుంది, రొమ్ము, చంకలలో నొప్పిలేని గడ్డలు ఉత్పత్తి అవుతాయి. మీలో ఇటువంటి లక్షణం కూడా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.

యోని ఇన్ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుర్వాసనతో కూడిన యోని క్యాన్సర్ కు గురికావచ్చు. పీరియడ్స్ సమయంలో ఒక వారం కంటే ఎక్కువగా రక్తస్రావం జరిగినా, మీ ముందు సైకిల్స్ కంటే ఎక్కువ రక్తస్రావం జరిగినా ఒకసారి డాక్టర్ను సంప్రదించండి.

ఒక సంవత్సరం పీరియడ్స్ ఆగిపోయి తర్వాత పీరియడ్స్ వచ్చిన, పీరియడ్స్ అయిపోయిన తర్వాత రక్తస్రావం, లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం జరగడం గర్భాశయం క్యాన్సర్ మొదటి లక్షణం కావచ్చు. ఇటువంటి సమస్యలకు గురి అవుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఎంతో శ్రేయస్కరం.

Advertisement

ఉన్నట్టుండి బరువు తగ్గడం, కడుపు ఉబ్బరం వంటివి కూడా అండాశయ క్యాన్సర్ యొక్క మొదటి దశ లక్షణాలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే డాక్టర్ను సంప్రదించి టెస్ట్ చేసుకోండి. మొదటి స్టేజ్ లో గుర్తించడం వల్ల ఈ సమస్య తీవ్రం అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామాలు చేయడం వల్ల కూడా కొన్ని వ్యాధుల నుండి బయట పడవచ్చు.

Read Also : MLA Roja : ఆ హీరో‌పై మనసు పడిన జబర్దస్త్ జడ్జి రోజా.. అవకాశం వస్తే నటిస్తానంటూ కామెంట్స్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel