Coconut Water : ఖాళీకడుపుతో కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

Updated on: August 20, 2022

Coconut Water : కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ప్రత్యేకించి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పైగా కొబ్బరి నీళ్ళలో ఉండే తక్కువ క్యాలరీల వల్ల దీన్ని సూపర్ డ్రింక్ గా చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తీసుకోవడం చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

Benifits Of Coconut Water
Benifits Of Coconut Water

Coconut Water :  కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..

మెరిసే చర్మం కోసం : కొబ్బరి నీళ్లలో యాంటి మైక్రోబయల్ గుణాలున్నాయి. ఇవి ముఖంపై ఏర్పడే మొటిమలను నివారించడంలో తోడ్పడతాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు శరీరంలోని ఫ్రీరాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతాయి. కొబ్బరినీళ్లు తరచుగా తీసుకోవడం వల్ల చర్మం నిగారింపుతో మెరుస్తుంది.

అధిక రక్తపోటు : కొబ్బరినీళ్లు తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇక కొబ్బరి నీళ్లలో లభించే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వలన అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Advertisement

కిడ్నీ స్టోన్స్ : మూత్రపిండాలలో ఏర్పడే స్టోన్స్ నివారించడానికి కొబ్బరినీళ్లు ఎంతగానో సహాయపడతాయి. ఇలాంటి సమయాలలో కొబ్బరి నీళ్లను డైలీ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి బాడీ నీ హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి. కొబ్బరినీళ్లు కిడ్నీలో రాళ్ళను తొలగించడం కాకుండా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో ఎంతగానో తోడ్పడతాయి.

హైడ్రేటెడ్ గా : కొబ్బరి నీళ్ళలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇందులో లభించే పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాల వలన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అలసట, నీరసం, తల తిరగడం వంటి సమస్యలు వచ్చినప్పుడు దాని నుండి ఉపశమనం పొందడంలో కొబ్బరినీళ్లు ఎంతగానో మేలు చేస్తాయి.

బరువు తగ్గడంలో : కొబ్బరి నీళ్ళలో పొటాషియం, బయోయాక్టివ్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగిపోతాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. కొబ్బరినీళ్లు తరచుగా తీసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది.

Advertisement

Read Also : Banana Black Spots : అరటి పళ్ళపై నల్లటి మచ్చలు ఉంటే తినొచ్చా? ఆరోగ్యానికి ప్రమాదకరమా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel