Amla Benefits : ఉసిరితో ఇన్ని ఉపయోగాలా.. అర్జెంటుగా తినేయండి మరి..

Updated on: October 25, 2022

Amla Benefits : ఉసిరిచేసే మేలు ఉల్లిగడ్డ కూడా చేయదంటారు. ఉసిరిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఉసిరిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఆమ్లాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి ది కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల రోగాల నుండి శరీరాన్ని కాపాడటంలో ఇమ్యూనిటీది ఎంత పెద్ద పాత్రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Benefits of Amla in winter season
Benefits of Amla in winter season

ఉసిరిలో విటమిన్ సి తో పాటు.. విటమిన్- ఎ, విటమిన్- బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, డైయూరిటిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఉసిరికాయ సాయపడతాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. ఆమ్లాలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా ఉంచుంతుంది.

Amla Benefits : ఉసిరి ఔషధ గుణాలు..

అలాగే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో ఉసిరి చక్కగా పని చేస్తుంది. ఉసిరి తినడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోని ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఉసిరిలోని పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు తొలగిస్తుంది.

Advertisement

Read Also : Diabetes: ఈ చిట్కాలతో షుగర్ ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు

Read Also : Pumpkin Benefits: గుమ్మడికాయతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే వదిలిపెట్టరు

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel