Tolly wood Heroines: విదేశీయులను పెళ్ళి చేసుకున్న తెలుగు హీరోయిన్లు వీళ్ళే..?

Updated on: September 27, 2022

Tolly wood Heroines: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారిలో కొంతమంది హీరోయిన్లు మన దేశానికి చెందిన వారిని కాకుండా విదేశాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకొని కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు లేవని నిరూపించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో వారిలో మాధవి కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన మాధవి 1996లో జర్మనీ కి చెందిన రాల్ఫ్ శర్మ అనే ఫార్మాస్యూటికల్ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం వీరు న్యూ జెర్సీలో నివాసం ఉంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అచ్చ తెలుగు అమ్మాయిల రంభ కూడా ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది సార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్ అనే వ్యక్తిని 2010లో వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి కూడా ముగ్గురు పిల్లలు.

బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ప్రీతి జింటా గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగులో వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ప్రీతి జింటా అమెరికాకు చెందిన జీన్ గుడ్‌నఫ్‌ అనే వ్యక్తిని 2016 లో వివాహం చేసుకుంది. వీరికి కూడా ఇద్దరు పిల్లలు. ప్రీతి జింటా అమెరికాలో కొంతకాలం ఇండియాలో కొంతకాలం నివసిస్తూ ఉంటారు.

Advertisement

రక్త చరిత్ర లెజెండ్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాధిక ఆప్టే. ఇలా తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రాధిక ఆప్టే లండన్ కు చెందిన బెనెడిక్ట్ టేలర్‌ అను వ్యక్తిని 2013లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఇండియాలో నివసిస్తోంది.

టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన లయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. విజయవాడకి చెందిన లయ 2006లో కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరు అమెరికాలోనే సెటిల్ అయ్యారు.

Advertisement

Tolly wood Heroines:

భద్ర పందెంకోడి వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ మీరాజాస్మిన్. సహజనటిగా గుర్తింపు పొందిన మీరాజాస్మిన్ దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ అనే ఇంజినీర్ ను 2014 లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మీరాజాస్మిన్ దుబాయ్ లోనే సెటిల్ అయింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel