Sudigali Sudheer : ఢీషోలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్న సుడిగాలి సుధీర్… ఒక్కో ఎపిసోడ్‌కి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Updated on: April 26, 2022

Sudigali Sudheer : ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ జీవనం గడుపుతున్న సుడిగాలి సుదీర్ కి జబర్దస్త్ కార్యక్రమం ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అయింది.జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి సుధీర్ తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో టీమ్ లీడర్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుధీర్ ఎదుగుతూ బుల్లితెరపై వివిధ కార్యక్రమాలలో పాటిస్పేట్ చేయడమే కాకుండా ఇతర అవకాశాలను కూడా అందుకున్నారు.

Sudigali Sudheer
Sudigali Sudheer

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ఢీషోలో కూడా రష్మీతో కలిసి చేసే హంగామా అందరికీ తెలిసిందే. చాలామంది ఈ కార్యక్రమాన్ని డాన్స్ కోసం కాకుండా సుధీర్ మధ్యలో చేసే కామెడీ కోసం ఈ కార్యక్రమం చూసేవారు. అయితే కొన్ని కారణాల వల్ల సుధీర్ రష్మీ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ డాన్స్ షో లో సుధీర్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. ఈ కార్యక్రమం రేటింగ్స్ సాధించడం కోసం ప్రదీప్, హైపర్ ఆది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రేటింగ్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి.

ఇక ఈ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ దృష్టిలో పెట్టుకొని మల్లెమాల వారు సుడిగాలి సుదీర్ ను తిరిగి ఢీషోలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోని సుధీర్ ఎంట్రీ కోసం మల్లెమాల వారు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఒక్కో ఎపిసోడ్ కు రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని సుధీర్ ఈసారి ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలోనే సుడిగాలి సుదీర్ ఢీషోలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

Advertisement

Read Also : Rashmi – Sudheer: రష్మి ఫోన్ నెంబర్ సుధీర్ ఏమని ఫీడ్ చేసుకున్నారో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel